Home జోగులాంబ గద్వాల్ విద్యుదాఘాతంతో యువకుడు మృతి

విద్యుదాఘాతంతో యువకుడు మృతి

Young Man Died With Electrocutionజోగులాంబ గద్వాల : విద్యుదాఘాతంతో ఓ యువకుడు మృతి చెందిన విషా ఘటన మల్లకల్ మండల పరిధిలోని నాగర్ దొడ్డి గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. నాగర్ దొడ్డి గ్రామానికి చెందిన పరశురాముడు (26) పొలంలో నీళ్లు పెడుతున్న సమయంలో విద్యుత్ తీగలు తగిలాయి. దీంతో పరశురాముడు విద్యుదాఘాతానికి గురై ఘటనాస్థలిలోనే చనిపోయాడు. నిరుపేద పరశురాముడు కుటుంబాన్ని ఆదుకోవాలని ఆ గ్రామ ప్రజలు ప్రభుత్వాన్ని కోరారు. పోస్టుమార్టం నిమిత్తం పరశురాముడు మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.