Home తాజా వార్తలు విద్యుదాఘాతంతో యువకుడు మృతి

విద్యుదాఘాతంతో యువకుడు మృతి

Young Man Died With Electrocution In Rangareddyరంగారెడ్డి : టివిని ఆన్ చేస్తున్న సమయంలో విద్యుదాఘాతానికి గురై పాండురంగం(29) అనే యువకుడు చనిపోయాడు. ఈ ఘటన షాబాద్ మండలం నాగర్ కుంట గ్రామ శివారు ఆమిర్ గూడెంలో శుక్రవారం మధ్యాహ్నం జరిగింది. మధ్యాహ్న సమయంలో పాండురంగం టివి పెడుతున్న క్రమంలో ఒక్కసారి విద్యుదాఘాతానికి గురయ్యాడు. వెంటను అతడిని చికిత్స నిమిత్తం హైదరాబాద్ కు తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయాడు. మృతుడు పాండురంగంకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పోస్టుమార్టం నిమిత్తం పాండురంగం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.