Home కరీంనగర్ డబ్బులు చెల్లించడం లేదంటూ యువకుడి ఆత్మహత్య…

డబ్బులు చెల్లించడం లేదంటూ యువకుడి ఆత్మహత్య…

Young man

 

హుజూరాబాద్‌ : మండలంలోని బోర్నపల్లి గ్రామానికి చెందిన ఓ యువకుడు తనకు రావాల్సిన డబ్బులను చెల్లించడంలో పైనాన్స్ యాజమాన్యం ఇబ్బందులకు గురి చేస్తుండటంతో మనస్థాపానికి గురై ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన బుధవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే గ్రామానికి చెందిన గంట శ్రీకాంత్(28) అనే యువకుడు ఓ ప్రైవేట్ పైనాన్స్‌లో రూ. 11 లక్షలు పెట్టగా తిరిగి ఆ డబ్బులను ఇవ్వమని కోరితే సదరు పైనాన్స్ యాజమానులు డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తుండటంతో కలత చెంది ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంట్లో దూలానికి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డా డు.

 

Young man died with Financial ownership Difficulties