Home మల్కాజ్‌గిరి (మేడ్చల్) రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

Young Man Dies In RoadAccident In Medchal District

కీసరః ద్విచక్ర వాహనం అదుపు తప్పి డివైడర్‌ను ఢీ కొట్టిన ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన శనివారం కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సిఐ సురేందర్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం. అబ్దుల్లాపూర్ మెట్టు, కమ్ముగూడ గ్రామానికి చెందిన పొన్న శివశంకర్ (28) కీసర మండల పరిధి చీర్యాల్‌లోని గీతాంజలి ఇంజనీరింగ్ కళాశాలలో అసిస్టెంట్ ఫ్రొఫేసర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. శనివారం సాయత్రం విధులు ముగించుకొని ద్విచక్ర వాహనంపై ఇంటికి బయలుదేరగా కీసర ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో వర్ధనా స్కూల్ వద్ద వాహనం అదుపుతప్పి డివైడర్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంతో శివశంకర్ తలకు బలమైన గాయాలు కావడంతో అక్కడి కక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకొని ధర్యాప్తు చేస్తున్నారు.

 మరో ప్రమాదంలో  ప్రమాద వశాత్తు  కారు దగ్ధం

Young Man Dies In RoadAccident In Medchal District

కీసరః రాంపల్లి ఆర్‌ఎల్ నగర్ వద్ద ప్రమాద వశాత్తు కారు దగ్ధమైంది. సాంకేతిక లోపంతో హఠాత్తుగా మంటలు చెలరేగడంతో పరిస్థితిని గమనించిన డ్రైవర్ కారును ఆపి దిగిపోవడంతో ప్రమాదం తప్పింది. ఈ సంఘటన కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఉప్పల్ చిలుక నగర్‌కు చెందిన ఎ.శ్రీనివాస్ శనివారం మధ్యాహ్నం 2016 మోడల్ ఇండికా కారులో ఘట్‌కేసర్ నుంచి ఇసీఐఎల్‌కు బయలుదేరగా రాంపల్లి ఆర్‌ఎల్ నగర్ వద్ద ప్రమాద వశాత్తు కారు ముందు బాగంలో మంటలు వ్యాపించాయి. పరిస్థితిని గమనించిన శ్రీనివాస్ కారును ఆపి దిగిపోయి ప్రణాలు దక్కించుకున్నాడు. సమాచారం అందుకున్న చర్లపల్లి అగ్ని మాపక శాఖ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అందుపులోకి తేగా అప్పటికే కారు పూర్తిగా అగ్నికి ఆహుతైంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని ధర్యాప్తు చేస్తున్నారు.