Home తాజా వార్తలు చెరువులో మునిగి యువకుడు మృతి

చెరువులో మునిగి యువకుడు మృతి

Young Man Drown In Pond And Died At Sangareddyసంగారెడ్డి : చెరువులో మునిగి మహేశ్ (32) అనే యువకుడు చనిపోయాడు. ఈ ఘటన హత్నూర మండల పరిధిలోని గుండ్లమచూనుర్‌లో మంగళవారం జరిగింది. గుండ్లమచూనుర్‌ గ్రామానికి చెందిన మహేశ్‌(32) సోమవారం ఇంట్లో నుంచి భయటకు వెళ్లాడు. కానీ తిరిగి ఇంటికి రాలేదు. దీంతో మహేశ్ ఆచూకీ కోసం అతడి బంధువులు గాలించినప్పటికీ ఫలితం కనిపించలేదు. మంగళవారం ఉదయం గ్రామశివారులోన పెద్ద చెరువు వద్ద మహేశ్ మృతదేహాన్ని అతడి యాదయ్య గుర్తించారు. కాలకృత్యాల కోసం వెళ్లి మహేశ్ ప్రమాదవశాత్తు చెరువులో పడి చనిపోయినట్టు పోలీసులు భావిస్తున్నారు. పోస్టుమార్టం కోసం మహేశ్ మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.