Home జనగామ చెరువులో మునిగి యువకుడు మృతి

చెరువులో మునిగి యువకుడు మృతి

Young Man drowned In Pond And Diedజనగామ : కొడకండ్ల మండల పరిధిలోని ఏడునూతుల గ్రామంలో శుక్రవారం విషాద ఘటన చోటు చేసుకుంది. చెరువులో మునిగి సయ్యద్ రియాజ్(19) అనే యువకుడు చనిపోయాడు. ఖమ్మం జిల్లా కేంద్రానికి చెందిన సయ్యద్ ఇక్బాల్ కొడుకు సయ్యద్ రియాజ్ గత మూడు రోజుల క్రితం అదృశ్యమయ్యాడు. శుక్రవారం ఏడగునూతుల గ్రామంలో ఉన్న చెరువులో రియాజ్ శవమై కనిపించాడు. ఈత రాకపోవడం కారణంగానే రియాజ్ చెరువులో మునిగి చనిపోయినట్టు ఆయన కుటుంబ సభ్యులు, పోలీసులు భావిస్తున్నారు. మృతుడు రియాజ్ తండ్రి గ్రామంలోని మసీదులో మొగుల్ సాహెబ్ గా పని చేస్తున్నారు. ఉన్న ఒక్క కొడుకు రియాజ్ చనిపోవడంతో ఇక్బాల్ కుటుంబంలో విషాదం అలుముకుంది. పోస్టుమార్టం నిమిత్తం రియాజ్ మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.