Home తాజా వార్తలు చెరువులో పడి యువకుడు మృతి

చెరువులో పడి యువకుడు మృతి

Young Man Fell In Pond and Died At Pulkal In Sangareddyసంగారెడ్డి : పుల్కల్ మండల కేంద్రంలో జరిగిన బతుకమ్మ వేడుకల్లో విషాదం నెలకొంది. బుధవారం రాత్రి బతుకమ్మను నిమజ్జనం చేస్తున్న క్రమంలో చాకలి శేఖర్ అనే యువకుడు కాలు జారి చెరువులో పడిపోయాడు. వెంటనే స్థానికులు శేఖర్ ను కాపాడి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు, సిబ్బంది లేకపోవడంతో శేఖర్ ను సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయాడు. పుల్కల్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే శేఖర్ చనిపోయాడని అతడి బంధువులు, గ్రామస్తులు ఆందోళనకు దిగారు. శేఖర్ కుటుంబానికి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. పోస్టుమార్టం కోసం శేఖర్ మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.