Saturday, April 20, 2024

చెల్లి పెళ్లి చెడగొట్టిన ప్రియుడిని నడిరోడ్డుపై కత్తితో పొడిచి…

- Advertisement -
- Advertisement -

Young man killed with love affair in Jangaon

 

జనగాం: చెల్లి పెళ్లి చెడగొట్టిన లవర్‌ను ఆమె సోదరుడు చంపిన సంఘటన జనగాం జిల్లా బచ్చన్నపేట మండలం కొడవటూర్ కమాన్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. షేర్ని గ్రామానికి చెందిన శ్రీధర్ అనే యువకుడు తన అమ్మమ్మ వాళ్ల ఊరు కొడవటూరులో చదువుకుంటున్నాడు. అదే గ్రామానికి చెందిన యువతితో ప్రేమలో పడ్డాడు. ఈ విషయం యువతి కుటుంబ సభ్యులకు తెలియడంతో శ్రీధర్‌, అతడి తాతను బెదిరించారు. దీంతో యువతి తల్లిదండ్రులు మరో వ్యక్తితో పెళ్లి నిశ్చయం చేశారు. పెళ్లి కుమారుడికి శ్రీధర్ ఫోన్ చేసి తాము ప్రేమించుకుంటున్నామని పెళ్లి చేసుకోవద్దని తెలిపాడు. పెళ్లి చెడిపోవడంతో యువతి సోదరుడు శివకుమార్ అతడిపై పగపెంచుకున్నాడు. రోడ్డుపై వెళ్తున్న శ్రీధర్‌ను ఆటోతో శివకుమార్ ఢీకొట్టి కత్తితో పలుమార్లు పొడిచాడు. ఘటనా స్థలంలోనే అతడు చనిపోయాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News