Home ఆంధ్రప్రదేశ్ వార్తలు విజయవాడలో యువకుడి హత్య

విజయవాడలో యువకుడి హత్య

Murderవిజయవాడ :  పట్టణంలోని అరండల్‌పేట ప్రాంతంలో ఉన్న ఉర్దూ స్కూల్‌ సమీపంలో శనివారం తెల్లవారుజామున ఓ యువకుడిని దుండగులు దారుణంగా హత్య చేశారు. అరండల్ పేటలో ఉండే మంగింశెట్టి మనోజ్ పై దుండగులు దాడి చేసి హత్య చేశారు. మనోజ్ తలపై బండరాయితో మోదడంతో అతడు అక్కడికక్కడే చనిపోయాడు. పాతకక్షల కారణంగానే మనోజ్ ను హత్య చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. పోస్టుమార్టం కోసం మనోజ్ మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Young Man Murder In Arundalpet At Vijayawada In AP