Home తాజా వార్తలు ప్రాణం తీసిన ప్రేమ వివాహం …

ప్రాణం తీసిన ప్రేమ వివాహం …

Murder

ఖానాపూర్ : నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో గురువారం రాత్రి జరిగిన హత్య సంచలనం సృష్టించింది. పట్టణంలోని పద్మావతి నగర్ భీమన్న దేవాలయం సమీపంలో ఉన్న అట్వాల్ సందీప్(32) అనే యువకుడిని దారుణంగా హత్య చేశారు. పోలీసుల వివరాల ప్రకారం… అట్వాల్ సందీప్ తన ఇంటి సమీపంలోని ముస్లిం అమ్మాయిని మూడేళ్ల క్రితం ప్రేమించి పెండ్లి చేసుకున్నాడు. అప్పటి నుండి అమ్మాయి కుటుంబ సభ్యులు సందీప్‌ను బెదిరిస్తున్నారన్నారు. సందీప్‌ను పెండ్లి చేసుకున్న యువతి ప్రస్తుతం పుట్టింటి వద్ద ఉంది. బుధవారం రాత్రి తన ఇంటి వెనుక భాగంలో సోఫాలో పడుకొని ఉన్న సందీప్‌ను అమ్మాయి తరపు 12 మంది కత్తులతో పొడిచి హత్య చేశారని మృతుడి తమ్ముడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సమాచారం మేరకు నిర్మల్ డిఎస్పీ ఉపేందర్‌రెడ్డి హుటాహుటిన ఖానాపూర్‌కు వచ్చి విచారణ చేపట్టారు. పోలీసులు బందోబస్తు చేపట్టారు. మృతుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అమ్మాయి తరపు వారు అయిన మాజీత్, సజ్జత్, సబ్బీ ర్,ముజాహిద్, సాహిద్, మున్ని, అప్రోజ్, ఇంరాన్, అఫేజ్, నజీర్, మోహినోద్దిన్, ఇర్ఫాన్‌ల పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ప్రసాద్ పేర్కొన్నారు.

Young man Murdered in Nirmal