Home తాజా వార్తలు తన భూమిని ఇప్పించాలని పురుగుల మందు తాగిన యువకుడు…

తన భూమిని ఇప్పించాలని పురుగుల మందు తాగిన యువకుడు…

Drank Insecticide

 

వనపర్తి కలెక్టరేట్ ప్రజావాణిలో సంఘటన

వనపర్తి  : తనకు సంబంధించిన భూమిని గ్రామ మాజీ సర్పంచ్ ఆర్ బుచ్చన్నఅక్రమంగా పట్టా చేయించుకొని ఆక్రమించుకున్నాడని ఆరోపిస్తు తనకు న్యాయం చేయాలని వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం కంచిరావుపల్లి గ్రామానికి చెందిన వడ్డె శేఖర్ అనే యువకుడు సోమవారం వనపర్తి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆవరణలో పురుగుల మందు సేవించి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు.

వడ్డె శేఖర్ తండ్రి పెద్ద కిష్టన్న కు ముగ్గురు కుమారులు తాతల నుండి వారసత్వంగా వచ్చిన సర్వే నెంబర్ 149,576ల్లోని 12 ఎకరాల భూమిలో తన వాటాగా రావాల్సిన భూమిని గత ఐదు సంవత్సరాల క్రితం గ్రామ మాజి సర్పంచ్ ఆర్.బుచ్చన్న అక్రమంగా పట్టా చేయించుకొని భూమిని ఆక్రమించుకున్నారని గత నాల్గు సంవత్సరాల నుండి తనకు న్యాయం చేయాలని అధికారులను కోరుతూజిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ప్రజావాణిలో పిర్యాదు చేసిన అధికారులు స్పంధించడం లేదని ఆరోపిస్తు కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి కొనసాగుతుండగా కలెక్టర్ కార్యాలయం బయట వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగడంతో అక్కడే ఉన్న పోలీసులు వడ్డె శేఖర్‌ను వెంటనే ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఎలాంటి ప్రమాదం లేదని పట్టణ ఎస్‌ఐ నరేందర్ తెలిపారు.

Young man who Drank Insecticide for his Land