Home జాతీయ వార్తలు క్షణాల్లో ప్రాణాలతో బయటపడ్డాడు… (వీడియో)

క్షణాల్లో ప్రాణాలతో బయటపడ్డాడు… (వీడియో)

Accident

 

కేరళ : ఓ వ్యక్తి స్కూటీపై వెళ్తుండగా ప్రమాదవశాత్తు బస్సు ముందు టైరు కింద పడి ప్రాణాలతో బయటపడిన సంఘటన కోజికోడ్ జిల్లా ఎంగపుజా ప్రాంతంలో జరిగింది. సింగిల్ లేన్ రోడ్డు మార్గంలో వస్తున్న బస్సు ముందు చక్రాల కింద స్కూటీపై వస్తోన్న వ్యక్తి పడిపోయాడు. బస్సు స్కూటీతో పాటుగా ఆ వ్యక్తిని  ముందుకు నెట్టుకు వస్తున్న క్రమంలో అక్కడ ఉన్నస్థానికులు గమనించి డ్రైవర్ ను అప్రమత్తం చేశారు. దీంతో డ్రైవర్ బస్సును వెంటనే నిలిపివేయడంతో వాహనదారుడు ప్రాణాలతో బయటపడ్డాడు. బస్సు ఇంక ఏ మాత్రం ముందుకెళ్లినా ఆ వ్యక్తి టైర్ల కిందపడి ప్రాణాలు కోల్పోయెవాడు.

Young man who Survived by falling under Bus