Home తాజా వార్తలు కుంటాల జలపాతంలోయువకుడి గల్లంతు

కుంటాల జలపాతంలోయువకుడి గల్లంతు

Kuntala Water Falls

 

బాసర : ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోని కుంటాల జలపాతంలో సోమవారం బాసర మండలం దోడపూర్ గ్రామానికి చెందిన యువకుడు గల్లంతయ్యాడు. వివరాల్లోకి వెళ్లితే.. సోమవారం దోడపూర్ గ్రామానికి చెందిన కుర్లే శ్రీకాంత్(24) తన స్నేహితులతో కలిసి ప్రైవేట్ వాహనంలో కుంటాల జలపాతానికి బయల్దేరాడు. మధ్యాహ్నం కుంటాల జలపాతానికి చేరుకున్న వీరు సరదాగా సెల్ఫీలు దిగే క్రమంలో ప్రమాదవశాత్తు శ్రీకాంత్ కాలు జారీ జలపాతంలో పడిపోయాడు.

స్నేహితులు వెంటనే అక్కడి అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు పోలీసులకు తెలియజేశారు. నేరడిగొండ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని గజ ఈతగాళ్లతో మధ్యాహ్నం వెతికారు. రాత్రి ఏడు గంటల ప్రాంతంలో అతని మృతదేహం లభ్యమైంది. స్నేహితుల వద్ద నుంచి వివరాలు సేకరించిన నేరడిగొండ పోలీసులు బాసర పోలీసులకు సమాచారాన్ని అందించారు. దీంతో మృతుడి కుటుంబీకులకు అక్కడి పోలీసులు సమాచారం అందించారు. స్నేహితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు. జలపాతాన్ని సందర్శించేందుకు వచ్చే వారు జాగ్రత్తలు పాటించాలని పోలీసులు సూచించారు.

Young Men fell in Kuntala Water Falls