Home తాజా వార్తలు యువతిపై సామూహిక అత్యాచారం

యువతిపై సామూహిక అత్యాచారం

పేమ పేరుతో నమ్మించి మద్యం తాగించి స్నేహితులతో కలిసి ఘాతుకం
gang rapeమన తెలంగాణ / లింగాలఘణపురం (వరంగల్): ప్రేమ పేరుతో ఓ యువతిని మోసం చేయడమేకాకుండా, మాయమాటలతో తీసుకెళ్లిన ఓ యువకుడు తన స్నేహితులతో కలిసి సామూహిక అత్యాచా రానికి పాల్పడిన సంఘటన ఆల స్యంగా వెలుగుచూసింది. వరం గల్ జిల్లా లింగాల ఘణపురం మండలం నెల్లుట్ల గ్రామంలో ఈ దారుణం చోటుచేసుకుంది. ఈ విషయమై జనగామ డిఎస్‌పి కూర సురేందర్ స్థానిక పోలీస్‌స్టేషన్‌లో జనగామ రూరల్ సిఐతో కలిసి వివరాలు వెల్లడించారు. గ్రామానికి చెందిన యువతిని జనగామ పట్టణానికి చెందిన అలీం అనే యువకుడు కొంతకాలంగా ప్రేమిస్తున్నానంటూ నమ్మబలికాడు. అనం తరం మాయమాటలతో తనవెంట తీసుకెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకు న్నాడు. మంగళవారం రాత్రి అలీం మాటలను నమ్మి వెళ్లిన యువతిని లింగాలఘణపురం శివారులోని నెల్లుట్ల గ్రామంలోని పెద్దగుండ్ల వద్ద ఉన్న వెంచర్‌కు తీసుకొచ్చారు. అనంతరం బలవంతంగా మద్యం తాగించి అలీం సహా తన ముగ్గురు స్నేహితులు అత్యాచారానికి పాల్పడి, యువతిని అక్కడే వదిలేసి వెళ్లినట్లు తెలిపారు. బాధితురాలు రఘునాథపల్లి మండలానికి చేరుకోగా లింగాలఘణపురం ఎస్‌ఐ వెంకటేశ్వర్‌రావు, రఘునాథపల్లి ఎస్‌ఐ సత్యనారాయణ పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా సదరు యువతిని గుర్తించి వివరాలు సేకరించగా, జరిగిన విషయాన్ని వెల్లడించినట్లు చెప్పారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. కాగా బాధితురాలు పాలిటెక్నిక్ విద్యార్థిని అని పేర్కొన్నారు. ఈ సమావేశంలో రూరల్ సిఐ వాసాల సతీష్, ఎఎస్సై ఎలీయా, కానిస్టేబుల్ రవీందర్, సి.రవీందర్, బాబురావు, సురేశ్, వేణు, అశోక్, మహేందర్, రవి, సతీష్, జగన్ తదితరులు పాల్గొన్నారు