Home తాజా వార్తలు ప్రాణం తీసిన ఫేస్ బుక్ ప్రేమ

ప్రాణం తీసిన ఫేస్ బుక్ ప్రేమ

 

భద్రాద్రి కొత్తగూడెం : ఫేస్ బుక్ ప్రేమ ఓ యువతి ప్రాణం తీసింది. వివరాలు ఇలా ఉన్నాయి. భద్రాచలం పట్టాణానికి చెందిన విమల (24)కు కుటుంబ పెద్దలు ఓ యువకుడితో పెళ్లి చేశారు. అయితే తనకు ఇష్టం లేని పెళ్లి చేశారంటూ మూడు నెలల్లోనే భర్తకు విడాకులు ఇచ్చింది. అనంతరం ఇంటి వద్ద ఉంటున్న విమలకు కరీంనగర్ జిల్లా పోరండ్లకు చెందిన పవన్ కుమార్  ఫేస్ బుక్ లో పరిచయమయ్యాడు. ఈ క్రమంలో వారిద్దరూ ప్రేమించుకున్నారు. దీంతో వారు రెండేళ్లుగా సహజీవనం సాగిస్తున్నారు. అయితే తనను పెళ్లి చేసుకోవాలని విమల పవన్ కుమార్ ను కోరింది. పవన్ కుమార్ మాత్రం మాయమాటలు చెబుతూ వాయిదా వేస్తూ వచ్చాడు. దీంతో విమల పెళ్లి చేసుకోవాలని అతడిని గట్టిగా నిలదీసింది. పెళ్లయి విడాకులు తీసుకున్న నిన్ను పెళ్లి చేసుకోనని పవన్ విమలకు తెగేసి చెప్పాడు. దీంతో మనస్థాపానికి గురైన విమల ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. విమల ఆత్మహత్యకు ఆమె ప్రియుడు పవన్ కుమారే కారణమని ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోస్టుమార్టం కోసం విమల మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Young Woman Commits Suicide At Bhadradri Kothagudem