ఖమ్మం : తల్లాడ మండల పరిధిలోని వె౦గన్నపేట గ్రామంలో విద్యుదాఘాతంతో ఓ యువతి చనిపోయింది. గ్రామ సర్పంచ్ బండారి ఏడుకొండలు చెల్లెలు వెంకటరమణ వడ్డె వీరయ్య అనే వ్యక్తి పొలంలో పని చేస్తుండగా విద్యుత్ మెయిన్ తీగలు తగిలి చనిపోయింది. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే తన చెల్లెలు చనిపోయిందని సర్పంచ్ బండారి ఏడు కొండలు ఆరోపించారు. పోస్టుమార్టం కోసం వెంకటరమణ మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. వెంకటరమణ కుటుంబానికి న్యాయం చేయాలని గ్రామ ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.