Friday, April 26, 2024

యాప్రాల్‌లో యువతి అదృశ్యం

- Advertisement -
- Advertisement -

young woman disappeared in Yapral

జవహర్‌నగర్: యువతి అదృశ్యమైన సంఘటన బుధవారం జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని యాప్రాల్‌లో చోటుచేసుకుంది. ఇన్‌స్పెక్టర్ భిక్షపతిరావు తెలిపిన వివరాల ప్రకారం రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన జి.హరికిషన్‌షాదే తన కుటుంబంతో కలిసి యాప్రాలో నివాసం ఉంటున్నాడు. హరికిషన్‌షాదే రెండవ కూతురు రిదిషాద్(22)కు ఇటివల పెండ్లి సంబంధాలు చూడగా,పెండ్లి ఇష్టం లేని రిదిషాద్ ఈ నెల 16 తేదిన ఇంట్లో ఎవరికి చెప్పకుండా బయటకు వెళ్లిపోయింది.కుటుంబ సభ్యులు చుట్టు పక్కల ప్రాంతాలలో,బందువుల ఇళ్లలో వెతికిన ఆచూకి లభ్యం కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.కాగా యువతికి గతంలో రాజస్థాన్ ప్రాంతానికి చెందిన వ్యక్తితో ప్రేమ వ్యవహారం ఉందని తల్లిదండ్రులు పోలీసులకు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకోని ధర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్ తెలిపారు.

young woman disappeared in Yapral

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News