Home తాజా వార్తలు చౌటుప్పల్‌లో యువతి అదృశ్యం

చౌటుప్పల్‌లో యువతి అదృశ్యం

Young Woman Disappears In Chautuppalయాదాద్రి భువనగిరి : చౌటుప్పల్‌లో ఓ యువతి అదృశ్యమైంది. సంస్థాన్‌ నారాయణపురం డాకు తండాకు చెందిన యువతి(23) హైదరాబాద్‌లో ప్రైవేటు ఉద్యోగం చేస్తోంది. చౌటుప్పల్‌లో హనుమాన్‌నగర్‌లో ఉంటున్న తన అక్క ఇంటికి ఇటీవల ఆమె వచ్చింది. కిరాణం దుకాణానికి వెళుతున్నానని ఈ నెల ఐదో  తేదీన ఇంట్లో చెప్పి బయటికి వెళ్లి తిరిగిరాలేదు. యువతి ఆచూకీ కోసం గాలించినప్పటికీ ఫలితం కనిపించలేదు. దీంతో శనివారం ఉదయం యువతి తండ్రి బన్సీలాల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. యువతి అదృశ్యంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.