Thursday, April 25, 2024

లాలాగూడ పిఎస్ పరిధిలో యువతి అదృశ్యం

- Advertisement -
- Advertisement -

Young woman disappears in Lalaguda PS Limits

తార్నాక: మానసిక స్థితి సరిగ్గా లేని ఓ యువతి అదృశ్యమైన సంఘటన లాలాగూడ పోలీస్ స్టేషన్ పరిదిలో చోటు చేసుకుంది. ఎస్సై కోటేశ్వర్‌రావు తెలిపిన వివరాల ప్రకారం… నార్త్‌లాలాగూడకు చెందిన రిటైర్డ్ రైల్వే ఉద్యోగి ఎండి. షిజావుర్ రెహమాన్ కూతురు అజ్మతున్సీసా(35) గత కొంత కాలంగా మానసిక వ్యాదితో బాధపడుతుంది. ఇదిలా ఉండగా మంగళవారం ఇంటి నుండి బయటకు వెళ్లిన అజ్మతున్సీసా తిరిగి రాలేదు. దీంతో కుటుంబసభ్యులు తెలిసిన వారి దగ్గర, చుట్టు ప్రక్కల, రైల్వే స్టేషన్ వద్ద వెతికారు. ఎంతకీ ఆచూకీ లభ్యం కాకపోవడంతో ఆమె తండ్రి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News