Home జాతీయ వార్తలు కర్నాటకలో పరువు హత్య

కర్నాటకలో పరువు హత్య

Young Woman Murder By Father In Karnatakaబెంగళూరు: కర్నాటకలోని రామనగర జిల్లా బెట్టహల్లి గ్రామంలో పరువు హత్య జరిగింది. దళిత యువకుడిని ప్రేమించిన పాపానికి ఓ యువతిని ఆమె కుటుంబ సభ్యులు దారుణంగా హత్య చేశారు. ఈనెల 9న సదరు ఆ యువతిని ఆమె తండ్రి , వరుస సోదరులు గ్రామ శివారులో ఉన్న తోటలోకి తీసుకెళ్లి హత్య చేశారు. అనంతరం యువతి మృతదేహాన్ని అక్కడే పాతిపెట్టారు. అనంతరం తన కుమార్తె కనిపించడం లేదని యువతి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన కుమార్తెను ఆమె ప్రియుడు కిడ్నాప్ చేసి హత్య చేసి ఉండొచ్చని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ క్రమంలో పోలీసులు దళితయువకుడిని విచారించారు. యువతి అదృశ్యం వెను ఆ యువకుడి ప్రమేయం లేదని తెలియడంతో అతడిని విడిచి పెట్టారు. అయితే వారం తర్వాత ఆ తోటలో మొక్కలు నాటేందుకు, తోట యజమాని ప్రయత్నించారు. దీంతో శిథిలమైన యువతి మృతదేహం వెలుగు చూసింది. ఈ క్రమంలో పోలీసులు యువతి తండ్రిని అదుపులోకి తీసుకుని విచారించారు. తానే మరో ఇద్దరి సహాయంతో తన కుమార్తెను హత్య చేసినట్టు ఆమె తండ్రి అంగీకరించాడు. దీంతో ఈ ఘటనలో పాల్గొన్న ముగ్గురిని అరెస్టు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.