Home తాజా వార్తలు ఉరేసుకొని యువతి ఆత్మహత్య

ఉరేసుకొని యువతి ఆత్మహత్య

Suicide

తూప్రాన్: మెదక్ జిల్లా తూప్రాన్ డివిజన్ కేంద్రంలో సోమవారం ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. స్థానికి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. పోతిరెడ్డిపల్లికి చెందిన భిక్షపతి గౌడ్, లక్ష్మి దంపతుల కుమార్తె నాగరాణి పాలిటెక్నిక్ లో ఫైనలియర్ చదువుతోంది. ఆదివారం ఇంట్లో ఎవరు లేని సమయంలో ప్యాన్ కు ఉరేసుకొని తనువు చాలించింది. కుటుంబ సభ్యులు ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె చనిపోయిందని పరీక్షించిన వైద్యులు వెల్లడించారు. స్థానిక ఎస్ఐ నాగార్జున గౌడ్ సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  యువతి మృతిపై స్థానికులు పలు అనుమానాలు వ్యక్తం చేసినట్టు సమాచారం.