Thursday, April 25, 2024

ఆటోలో నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న యువతి…

- Advertisement -
- Advertisement -

Young women dead with jump from auto

 

ఢిల్లీ: లవర్‌తో గొడవ జరగడంతో ప్రయాణిస్తున్న ఆటోలో నుంచి ఓ యువతి దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఢిల్లీలోని ఆశ్రమ్ చౌక్ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… సిద్దార్థ్ అనే యువకుడిని పరంజీత్ కౌర్ అనే యువతి ప్రేమిస్తోంది. పరంజీత్ కౌర్‌ను హృతిక్ అనే యువకుడు గాఢంగా ప్రేమిస్తున్నాడు. ముగ్గురు మధ్య ట్రైయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తోంది. ఆశ్రమ్ చౌక్ వద్ద ఉన్న పార్క్‌కు రమ్మని కౌర్‌కు హృతిక్ కబురు పంపాడు. యువతి పార్క్‌కు వచ్చిన తరువాత ఇద్దరు మధ్య గొడవ జరిగింది. యువతిని కల్యాణ్‌పురిలో వదిలిపెట్టేందుకు ఆటోలో ఇద్దరు బయలుదేరారు. మార్గ మధ్యలో గొడవ జరగడంతో యువతి ఫోన్‌ను బయటకు పడేసింది. ఆటోలో నుంచి దిగి ఫోన్‌ను తీసుకుంది. మళ్లీ ఆటోలో ఒంటరిగా ప్రయాణిస్తున్నప్పుడు బయటకు దూకింది. వెంటనే స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. సిద్ధార్థ్, హృతిక్ ఆస్పత్రి వెళ్లేలోపు కౌర్ చనిపోయిందని వైద్యులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News