Home తాజా వార్తలు రక్త సంబంధాన్నే పొడిచేసిన ఆస్థి గొడవలు

రక్త సంబంధాన్నే పొడిచేసిన ఆస్థి గొడవలు

Younger brother killed the elder brother's family in warangal

 

మనతెలంగాణ/వరంగల్ క్రైం : ఆస్థి వాటా వివాదాల్లో అన్నదమ్ముల మధ్య జరిగిన గొడవ రక్తసంబంధాన్నే తుడిచి పెట్టేసింది. తనకు వ్యాపారంలో వాటాలివ్వలేదని కక్ష పెంచుకున్న తమ్ముడు సొంత అన్న కుటుంబాన్నే కడతేర్చిన ఘటన వరంగల్ నగరంలో చోటు చేసుకుంది. వివరాలు స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. వరంగల్ జిల్లా వరంగల్ పట్టణంలోని ఎల్‌బినగర్ ప్రాంతంలో నివాసం ఉంటున్న చాంద్‌పాషా అతని తమ్ముడు షఫీలు పశువుల మాంసం విక్రయ వ్యాపారం చేసేవారు. గత కొద్ది సంవత్సరాలుగా కలిసి వ్యాపారం చేసినప్పటికి కొద్ది నెలల క్రితం ఇద్దరు విడివిడిగా వ్యాపారం చేసుకుంటున్నారు. అయితే తమ్ముడు వ్యాపారంలో ఉన్నదంతా పోగొట్టుకొని నష్టపోయాడు. తనకు ఇంకో నష్టపరిహారం మరో రూ.కోటి ఇవ్వాలని తమ్ముడు షఫీ అన్న చాంద్‌పాషాను అడుగగా చాంద్‌పాషా నీకు ఇవ్వలేనని తెలిపాడు. దాంతో కక్ష పెంచుకున్న షఫీ అన్న కుటుంబాన్ని అంతమొందించాలని పథకం వేశాడు.

అర్ధరాత్రి తలుపులు పగుల గొట్టి మూకుమ్మడి హత్యలు..
మంగళవారం అర్ధరాత్రి షఫీ తన అనుచర బృందాన్ని మరో తొమ్మిది మందిని వెంట వేసుకొని అన్న ఇంట్లోకి ప్రవేశించాడు. వారంతా గాడ నిద్రలో ఉండడంతో తలుపులు పగులగొట్టి లోపలికి ప్రవేశించాడు. గొడ్డళ్లు, కత్తులతో చాంద్‌పాషా, అతని భార్య సబీరా, ఖలీల్, సమద్, ఫాహద్‌లపై విచక్షణారహితంగా దాడి చేసి నరికి చంపారు. ఈదాడిలో చాంద్‌పాషా, సబీరా, ఖలీల్‌లు మృతిచెందగా సమద్, ఫాహద్‌లు తీవ్రగాయాలతో ఉండగా పోలీసులు సమాచారం అందుకొని వరంగల్ ఎసిపి గిరికుమార్ ఆధ్వర్యంలో అక్కడికి చేరుకొని తీవ్రగాయాలతో ఉన్న ఇద్దరిని ఎంజిఎం ఆస్పత్రికి తరలించారు. ఈవిషయంపై వరంగల్ ఎసిపి గిరికుమార్ మాట్లాడుతూ.. ఆస్థి ఇవ్వలేదని కక్ష పెంచుకొని షఫీ తన అన్న చాంద్‌పాషా కుటుంబంపై తెల్లవారుజామున దాడి చేసి హతమార్చినట్లు తెలిసిందని పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

Younger brother killed the elder brother’s family in warangal