Home తాజా వార్తలు రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

Young man died

 

నెక్కొండ: మండలంలోని దురదృష్టవశాత్తు ట్రాక్టర్, ద్విచక్ర వాహనం ఢీ కొట్టడంతో యువకుడు మృతి చెందిన సంఘటన బుధవారం చోటు చేసుకుంది. స్థానిక ఎస్‌ఐ తెలిపిన వివరాల ప్రకారం… అమీనాబాద్ గ్రామానికి చెందిన కోడెం భిక్షపతి (35) వరంగల్ రోడ్డులోని సుమంగళి పంక్షన్‌హలు సమీపంలో ట్రాక్టర్, ద్విచక్ర వాహనం ఢీ కొట్టడంతో తలకు బలంగా తగలడంతో తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకొని అక్కడి పరిస్థితిని పరిశీలించి మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు స్థానిక ఎస్‌ఐ నవీన్‌కుమార్ తెలిపారు.

Youngman died in Road accident at Warangal