Home తాజా వార్తలు చెరువులో మునిగి యువకుడు మృతి

చెరువులో మునిగి యువకుడు మృతి

Youngman Drown In Pond And Diedయాదాద్రి భువనగిరి :  సంస్థాన్‌ నారాయణపురంలో గురువారం ఉదయం విషాద ఘటన జరిగింది.  గణేశ్‌ నిమజ్జనం కోసం వెళ్లిన వంశీ అనే యువకుడు చెరువులో మునిగి మృతి చెందాడు. మండల పరిధిలోని సరళమైసమ్మ చెరువులో కొందరు యువకులు వినాయకుడిని నిమజ్జనం చేస్తున్న క్రమంలో వంశీ చెరువులో మునిగిపోయాడు. తోటి స్నేహితులు రక్షించే లోపే వంశీ చనిపోయాడు. వంశీ హైదరాబాద్ నగర పరిధిలోని కర్మన్ ఘాట్ కు చెందిన యువకుడిగా గుర్తించినట్టు పోలీసులు తెలిపారు. ఘటనాస్థలిని పోలీసులు పరిశీలించారు. పోస్టుమార్టం కోసం వంశీ మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు.