Home వార్తలు కుర్రాళ్లు కొట్టారు

కుర్రాళ్లు కొట్టారు

Untitled-hజూనియర్ ఆసియాకప్ ఛాంపియన్‌గా భారత్ ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి పాక్ విజయం

కుర్రాళ్లు సాధించారు. జూనియర్ ఆసియాకప్ టోర్నీ ఆరంభం నుంచి ఓటమే ఎరగని యువ భారత్ తుది పోరులోనూ అదే జోరు కొనసాగించింది. ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను చిత్తుచేసి టోర్నీలో మూడోసారి ఛాంపియన్‌గా అవతరించింది.

కౌంటన్(మలేసియా) : ఆసియా జూనియర్ కప్ ఛాంపియన్‌గా భారత హాకీ జట్టు అవతరించింది. టో ర్నీ ఆరంభం నుంచే అదిపోయే ఆటతో ప్రత్యర్థులను బెంబేలెత్తించిన భారత్ తుది పోరులోనూ ఏకపక్ష విజయాన్ని నమోదుచేసింది. డ్రగ్ ఫ్లిక్కర్ హర్మన్‌ప్రీత్ సింగ్(10వ, 15వ, 30వ, 53వ) మరోసారి గోల్స్ వర్షం కురిపించడంతో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో జరిగిన టైటిల్ పోరులో భారత్ 6-2తో ఘనవిజయం సాధించింది. మ్యాచ్ ఆరంభం నుంచే పాకిస్తాన్ గోల్ పోస్ట్‌పై దాడులు చేసిన భారత్ పదో నిమిషంలోనే ఖాతా తెరిచింది. టోర్నీ టాప్‌స్కోరర్, పెనాల్టీ స్పెషలిస్ట్ హర్మన్ ప్రీత్‌సింగ్ భారత్‌కు దక్కిన పెనాల్టీని ఎలాంటి గోల్‌గా మల్చాడు. మరో ఐదు నిమిషాలకే హర్మన్‌ప్రీత్ రెండో పెనాల్టీని గోల్(15వ నిమిషం) చేయడంతో భారత్ ఆధిక్యం రెట్టింపైంది. అయితే ఇక్కడి నుంచి పాకిస్థాన్ పుంజుకుంది. భారత దాడు లను సమర్థవం తంగా తిప్పికొట్టిన పాక్ బంతిని తమ ఆధీనంలోకి తెచ్చుకొని గోల్ ప్రయత్నాలు చేసింది. ఈక్రమంలో 28వ నిమిషంలో పాక్‌కు మహమ్మద్ యాఖూబ్ తొలి గోల్ అందించాడు. అయితే మరో రెండు నిమిషాలకే హర్మన్‌ప్రీత్(30వ) హ్యాట్రిక్ గోల్ నమోదుచేయడంతో తొలిఅర్ధభాగాన్ని భారత్ 3-1తో ముగించింది. ఇక రెండో అర్ధభాగంలో భారత్ మరింత దూకుడుగా ఆడింది. పాక్ రక్షణ దళాన్ని ఛేదించి పదే పదే గోల్ పోస్ట్‌పై దాడులు చేయడంతో 50 నిమిషాల ఆటము గిసే సమయానికి భారత్ ఆధిక్యం 5-1కి8 చేరింది. 44వ నిమిషంలో అర్మన్ ఖురేషి, 50వ నిమిషంలో మన్‌ప్రీత్ సింగ్ జూనియర్ ఫీల్డ్‌గోల్ నమోదుచేసి భారత్‌కు విజయాన్ని ఖాయం చేశారు. ఇక 53వ నిమిషంలో హర్మన్ ప్రీత్ మ్యాచ్‌లో నాలుగో గోల్ నమోదు చేయగా, మరో రెండు నిమిషాల్లో మ్యాచ్ ముగుస్తుం దనగా ముహమ్మద్ డిల్బెర్(68వ) గోల్ సాధించ డంతో భారత్ ఆధిక్యం 6-2కు తగ్గింది. టోర్నీ ఆద్యంతం అద్భుతంగా రాణించిన హర్మన్ ప్రీత్ సింగ్ 14 గోల్స్‌తో టాప్‌స్కోరర్‌గా నిలివగా, టోర్నీ ఉత్తమ గోల్‌కీపర్‌గా భారత్ గోల్‌కీపర్ వికాస్ దాహియా ఎంపికయ్యాడు.