Home జాతీయ వార్తలు మోడీ… నీ కోసం ఖర్మఫలం ఎదురుచూస్తోంది: రాహుల్

మోడీ… నీ కోసం ఖర్మఫలం ఎదురుచూస్తోంది: రాహుల్

Rahul Gandhi

 

ఢిల్లీ: దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ నంబర్ వన్ అవినీతి పరుడిగా జీవితం ముగించుకున్నారని ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు శారు. దీనికి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గట్టిగానే ట్వీట్టర్‌లో రీ కౌంటర్ ఇచ్చారు. నరేంద్ర మోడీ… యుద్ధం ముగిసిందని, ఖర్మఫలం మీకోసం ఎదురుచూస్తుందని దుయ్యబట్టారు. రాజీవ్ గాంధీని విమర్శించడం వల్ల తాను రాజకీయంగా లబ్ది పొందానన్న బ్రమలో మోడీ ఉన్నారని మండిపడ్డారు. మోడీ… మీ మీద ఇప్పటికి ప్రేమ ఉందని ఒక కౌగిలింత ఇస్తున్నానని రాహుల్ ట్వీట్ చేశారు. దేశానికి ప్రధాన మంత్రిగా ఉండి దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీపై ఇలాంటి విమర్శలు చేయడం మోడీ దిగజారుడుతనానికి నిదర్శనమని మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం చురకలంటించారు. రాజీవ్‌పై వచ్చిన ఆరోపణలలో వాస్తవం లేదని గతంలో ఢిల్లీ కోర్టు చెప్పిందని గుర్తు చేశారు. బోపార్స్ స్కామ్‌లో రాజీవ్ లంచం తీసుకున్నట్టుగా ఎక్కడ ఆధారాలు లేవని చిదంబరం స్పష్టం చేశారు. మోడీ హద్దులు దాటి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మోడీ, బిజెపికి ప్రజలే బుద్ది చెబుతారని ప్రియాంక గాంధీ తాజా వ్యాఖ్యలపై సమాధానమిచ్చారు.

 

Your Karma Awaits for PM Narendra Modi: Rahul Gandhi