Home దునియా నీ నడక నిన్ను చెబుతుంది…

నీ నడక నిన్ను చెబుతుంది…

నడక వారసత్వంగా రాదు. అనుకోకుండా మనుషులు ఎంచుకునే పద్ధతి మాత్రమే. చిన్నతనం నుంచే ఎలా నడవాలో నిర్ణయం తీసుకుంటారు. అదే నడకతీరు వెల్లడిస్తోందంటారు నిపుణులు.

 walking style

 

కొందరు వేగంగా నడుస్తారు. మరి కొందరు నెమ్మదిగా, హుషారుగా, జాగ్రత్తగా రకరకాలుగా నడుస్తూ ఉంటారు. నడక తీరు వ్యక్తిత్వాన్ని చెబుతుంది అంటారు నిపుణులు. మనం ఎలాంటి వాళ్లమో, మన నడకే చెప్పేస్తుందని మానసిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

* వేగంగా నడిచేవాళ్లలో ఆత్మవిశ్వాసం, ధైర్యం చాలా ఎక్కువట. అందరికన్నా గొప్పగా ఉండాలనుకుంటారు. వేగంగా నిర్ణయాలు తీసుకుంటారు. జీవితంలో ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. చిన్నపిల్లల మనస్తత్వం కలిగి ఉంటారు.
* నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ ఉండేవాళ్లు ప్రశాంత జీవనం కోరుకుంటారు. దేనికీ తొందర పడరు. వీళ్లకు ఎక్కువ ప్రమాదాలు జరగవు. నిదానంగా ఉంటారు కాబట్టి ఏ విషయంలో అయినా ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటారు. అయితే ఎప్పుడూ మంచి కంటే చెడు గురించే శంకిస్తూ ఉంటారు. ఏ పనిమొదలు పెట్టినా అది కాదేమోనన్న నిరుత్సాహంతో ఉంటారు.
* కొందరు వస్తుంటే ముందే నేలను తన్నుకుంటూ వస్తున్న శబ్దం వినబడుతుంది. వీళ్లు కోపిష్టివాళ్లట. ఎప్పుడూ చిరాకే, బొత్తిగా మొండివాళ్లు కూడా. చేసే పనిపట్ల ఎప్పుడూ శ్రద్ధ, స్థిరత్వం ఉండదు. వీళ్లు తీసుకునే నిర్ణయాలు కూడా గందరగోళంగా ఉంటాయి.

* పదిమందిముందు నడిచేందుకు కూడా భయపడుతూ తలవంచుకు నడిచేవాళ్లలో సిగ్గు చాలా ఎక్కువ. మాట్లాడలేరు. చేసే పనిలో స్థిరత్వం ఉండదు. తమ గురించి ఎదుటివాళ్లు ఏమనుకుంటున్నారో అన్న సంశయంతో ఉంటారు.
* కాస్త జాగ్రత్తగా చేతులు కట్టుకుని నడుస్తూ ఉండేవాళ్లు అక్కడక్కడ కనిపిస్తారు. వీళ్లు ఒంటరిగా ఉండేందుకు ఇష్టపడతారు. అలా ఆలోచి ంచుకుంటూ అజాగ్రత్తగా నడవటం వల్ల ప్రమాదాలకు లోనవుతూ ఉంటారు. చాలా మూడీగా ఉంటారు. అయితే లోతైన మనసు గలవారు. ఒక పట్టాన అంత త్వరగా బయటపడరు.
* రోడ్డుపైన ఎవర్ని పట్టించుకోకుండా, వేగంగా నడుస్తూ పాటలు వింటూ, ఫోన్‌లో మాట్లాడుకుంటూ, వాళ్ల దారిన ఎవర్ని పట్టించుకోకుండా వెళ్లిపోతూ ఉంటారు కొందరు. వీళ్లకు ధైర్యం ఎక్కువ. చాలా తేలికగా ఎలాంటి ఇబ్బంది నుంచైనా బయట పడతారు. ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఎవరికైనా సాయం చేసేందుకు ముందుంటారు.
* మరీ దేన్ని పట్టించుకోకుండా, ఏదో ఆలోచనల్లో మునిగి ఊహల్లో తేలిపోతూ నడచిపోతూ ఉంటారు. నడుస్తూ ఆలోచిస్తూ ఉంటారు. పక్కనే విమానం ఆగినా ఉలిక్కిపడరు. వీళ్లకి కష్టపడే మనస్తత్వం లేదు చాలా బద్ధకస్తులు.
* కొందరు ప్రశాంతంగా పకవాళ్ల చేతుల్లో చేయివేసి నెమ్మదిగా నడుస్తూ ఉంటారు. వీళ్లకు చక్కని ఊహా ప్రపంచం ఉంటుంది. ఎదుటివాళ్లను చాలా ప్రభావితం చేయగలరు. చాలా సౌకర్యంగా, కష్టం లేకుండా ఎలాంటి జీవితాన్ని అయినా గడిపేస్తారు. ఆర్థికపరమైన అంశాలు కూడా వీళ్ల మనసులో ఉండవు.

* కొందరు నిటారుగా ఛాతీని ముందుకు చాపి భుజాలు వెనక్కి వంచి ఎంతో స్థిరంగా, స్థిమితంగా నడుస్తుంటారు. వీళ్లు ఎలాంటి సవాళ్లనైనా స్వీకరిస్తారు. ఇతరులను ప్రభావితం చేస్తారు. నలుగురిలో గుర్తింపు పొందుతారు. చాలా తొందరగా వీళ్లకు ఏ విషయం అయినా విసుగు కలిగిస్తుందట. అందుకే నిత్యనూతనంగా ఉండేందుకు చూస్తారు. నిర్మొహమాటంగా, నిక్కచ్చిగా ఉంటారు. చక్కని నిర్ణయాలు తీసుకుంటారు. ఇలా నిటారుగా నడవటం మంచిదంటారు పరిశోధకులు. ఆరోగ్యంగా, స్వతంత్ర జీవితాన్ని సూచించేదిగా ఉంటుందీ నడక. ఇప్పుడు మీది ఎలాంటి మనస్తత్వమో తెలుసుకోవడం సులభం కదా!

Your walking style reveals about your personality, These studies also say that the way you walk, including speed, tells a lot about your personality traits.