Home జాతీయ వార్తలు పెళ్లి అయ్యాక తాగడం మానేశాడని…

పెళ్లి అయ్యాక తాగడం మానేశాడని…

Fightingఅమృత్‌సర్: మద్యానికి బానిసై జీవితాలను నాశనం చేసుకుంటున్నా వారు కొకొల్లలు. మద్యానికి బానిసైన వ్యక్తి కుటుంబం పడే బాధలు అన్నీ ఇన్నీ కావు. అలాంటి వారిచేత మద్యం మాన్పించడానికి ఆ ఫ్యామిలీ పడే స్ట్రగుల్ కూడా అంతే ఉంటుంది. కాని, ఏం లాభం ఇవాళ తాగడం మానేసిన అన్నావాడు రేపు మళ్లీ మందు సీసాతో ప్రత్యక్షమవుతాడు. తాగుబోతులను మద్యం మాన్పించడం అంటే అంతా సులువు కాదు. అలాంటిది ఓ వ్యక్తి తనంతట తాను మద్యం మానేసి హాయిగా ఉండడం నచ్చలేదు అతని స్నేహితులకు. పెళ్లి అయ్యాక గత కొన్ని నెలలుగా అతను మిత్రులతో కలిసి మందు కొట్టడం లేదు. దాంతో అతనిపై పగ పెంచుకొని ఇంటికి వచ్చి మరీ చావబాదారు. ఈ దారుణ సంఘటన పంజాబ్ రాష్ట్రంలోని అమృత్‌సర్ లో చోటుచేసుకుంది. వివాహం అయ్యాక తమ స్నేహితుడు మందు మానేసాడని, అతనిపై స్నేహితులు దాడి చేశారు.

అడ్డు వచ్చిన అతని భార్య, ఇతర కుటుంబ సభ్యులను కూడా చావగొట్టారు. దీనికి సంబంధించిన దృశ్యాలు ఇంటి బయట ఉన్న సిసిటివి కెమెరాలో రికార్డైంది. అమృత్ సర్‌లోని ఛెహరట్ ప్రాంతానికి చెందిన అమృత్‌పాల్‌కు సందీపకౌర్ తో ఏడాది క్రితం వివాహమైంది. అంతకుముందు మద్యం తాగే అలవాటు ఉంది అమృత్‌పాల్‌కు. దాంతో తన స్నేహితుడు జోధా సింగ్‌తో పాటు కూర్చుని మద్యం సేవించేవాడు. కాగా, అమృత్‌పాల్‌‌కు వివాహమైనప్పటి నుంచి అతను మద్యం తాగడం మానేశాడు. దీనితో పాటు స్నేహితులను కూడా కలవడంతగ్గించేశాడు. ఈ నేపథ్యంలో మిత్రులంతా కలిసి అమృత్‌పాల్‌‌‌ను అతని ఇంటిముందు చావబాదారు. అంతేకాకుండా అడ్డువచ్చిన భార్య, అతని కుటుంబ సభ్యులపై కూడా చేయిచేసుకున్నారు.అమృత్‌పాల్‌‌ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సిసిటివి దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.

Youth Beaten Friend for Stopping Alcohol in Amritsar