Home జాతీయ వార్తలు ఎనిమిదేండ్ల బాలికపై అత్యాచారం, హత్య

ఎనిమిదేండ్ల బాలికపై అత్యాచారం, హత్య

rape

లక్నో: 19ఏండ్ల యువకుడు అదే గ్రామానికి చెందిన ఎనిమిదేండ్ల బాలికపై అత్యాచారం, హత్యాయత్నం చేసిన దారుణ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని నోయిడా సాలాపూర్‌ గౌతమబుద్ధ నగర్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. స్థానికంగా ఉండే యువకుడు గ్రామానికి చెందిన బాలికపై అత్యాచారం చేసి, హత్యయత్నం చేశాడు. బాలిక మరణించిందని భావించిన దుండగుడు అక్కడినుంచి పరారయ్యాడు. తెల్లవారుజామున బాలికను గుర్తించిన స్థానికులు సమీప చైల్డ్ పిజిఐ ఆస్పత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తీవ్రంగా గాయపడిన బాలిక చికిత్సపొందుతూ కన్నుమూసిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.

Youth held in Noida for rape murder of 8yr old girl