Home లైఫ్ స్టైల్ యువత చూపు ఎటువైపు..

యువత చూపు ఎటువైపు..

ఎప్పుడూ ఆన్‌లైన్‌లో ఉండే యువత రోజు రోజూకీ ఇంటర్నెంట్‌లో వచ్చే విష యాల గురించి తెలుసుకునేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. మార్కెట్లోకి వచ్చే కొత్త కొత్త గాడ్జెట్స్ గురించి పూర్తిగా తెలుసుకుని కొనుగోలు చేస్తున్నారు గత 12 నెలల్లో దాదాపుగా 5.4 కోట్ల మంది ఈ లావా దేవీల నుంచి బయటికి వచ్చేశారని గూగుల్, ఒమ్డి యర్ నెట్‌వర్క్‌లు సంయుక్తగా నిర్వ హించిన ఒక సర్వే ప్రకారం వారు ఇచ్చిన ఒక రిపోర్టులో వెల్లడయ్యింది. అందులో కొన్నింటి గురించి తెలుసుకుందాం…

Youth

ఈ కామర్స్‌కు : దీంతో భారత్‌లో ఇంటర్నెట్ చాలా వేగంగా విస్తరిస్తున్న ప్రస్తుత సమయంలో ఈ-కామర్స్‌కు భారీ డిమాండ్ ఉంటుందన్న అంచనాలు తలకిందులయ్యాయి. గతేడాది 5.4 కోట్ల మంది ఒక్కసారి మాత్ర మే ఆన్‌లైన్ కొనుగోళ్లకు ఆసక్తి చూపారు.
ఆన్‌లైన్‌లో లావాదేవీలు : భారత్‌లో గత కొన్ని సంవత్సరాలుగా ఇంటర్నెట్ వినియోగదారులు భారీగా పెరుగుతున్నారు. ప్రతీ ఏడాది దాదాపుగా 4 కోట్ల మంది కొత్తగా నెట్ వినియోగంలోకి వస్తున్నారు. మొత్తంగా 39 కోట్ల ఇంటర్నెట్ వినియోగదారుల్లో 40 శాతం మంది ఎప్పుడో ఒక్కసారి ఆన్‌లైన్‌లో లావాదేవీలు చేస్తున్నారు.

వ్యాపార వర్గాలు : మరోసారి ఈ వేదికల్లో ఎలాంటి కొనుగోళ్లు చేయడానికి ఆసక్తి చూపలేదు. దీంతో ఆన్‌లైన్ వ్యాపార వర్గాలు దాదాపుగా రూ.3.5 లక్షల కోట్లు (50 బిలియన్ డాలర్ల) వ్యాపారం కోల్పోయారని అంచనా.

రిటైల్ మార్కెట్‌లో : ఆన్‌లైన్ కొనుగోళ్లు తగ్గడానికి గల కారణాలను ఆ సంస్థలు ఈ నివేదికలో వెల్లడించాయి. ఆన్‌లైన్ ఉత్పత్తులపై నమ్మకం పడిపోవడం,అఫ్‌లైన్ లేదా రిటైల్ మార్కె ట్‌లో కొనుగోళ్లు అనుకూలంగా ఉండటం, రీఫండ్లు పొందండం సంక్లిష్టంగా మారడం వంటివి ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి.

పట్టణ వాసులే : ఆన్‌లైన్ లావాదేవీల్లో 56 శాతం మంది పురుషులు నమోదైయ్యారని అంచనా. ఇందులో 60 శాతం మంది పట్టణ వాసులే. అందులోనూ 80 శాతం మంది 34 సంవత్సరాల లోపు వారే. 5.4 కోట్ల మంది ఇ-కామర్స్‌కు దూరం కాగా మరో 5 కోట్ల మంది క్రియాశీలక కొనుగోలుదారులు ఆన్‌లైన్‌లో కొనసాగుతున్నారు.