Home ఆంధ్రప్రదేశ్ వార్తలు సుజనా..నీకిది తగునా?

సుజనా..నీకిది తగునా?

 

 

అమరావతి: వైఎస్‌ఆర్‌సిపి ఎంపీలు తమతో టచ్‌లో ఉన్నారంటూ బిజెపి ఎంపి సుజనా చౌదరి గురువారం ప్రెస్‌మీట్ పెట్టి మరీ ప్రకటించడంపై వైఎస్‌ఆర్‌సిపి ఎంపి విజయసాయిరెడ్డి మండిపడ్డారు. శుక్రవారం వరుస ట్వీట్లతో ఆయన సుజనా చౌదరిని ఎండగట్టారు. నిన్న సుజనా చౌదరి పెట్టిన ప్రెస్ మీట్ చేస్తూ భారతీయ జనతా పార్టీ(బీజేపి) వేరు, అందులో ఉన్న బాబు జనాల పార్టీ(బీజేపి) వేరు అని అందరికీ మరోసారి బాగా అర్థమయింది అంటూ విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు.

మరో ట్వీట్లో ఆయన బ్యాంకులను వేలకోట్లు ఎగ్గొట్టిన సుజనా చౌదరి బ్యాంకర్లతో కలసి ప్రెస్ మీట్ పెడితే బాగుండేదని విమర్శించారు. సుజనా చౌదరి ప్రెస్‌మీట్‌కి విశేష ప్రాధాన్యం ఇచ్చిన ఆంధ్రజ్యోతిని కూడా విజయసాయి రెడ్డి వదిలిపెట్టలేదు. సుజనా వారి మాయా సామ్రాజ్యం మీద ఒకప్పుడు మొదటి పేజీలో వరస కథనాలతో మోతెక్కించిన ఆంధ్రజ్యోతి ఇప్పుడు సుజనా చౌదరిని జస్టిస్ చౌదరిగా చూపించేందుకు న్ని ప్రెస్ మీట్‌ను లైవ్ స్ట్రీమింగ్‌లో మోతెక్కించిందంటే కారణం పబ్లిక్ ఇంటెరస్టా? లేక పబ్లిక్‌గా తెలిసిపోయిన ఇంటెరెస్టా? అంటూ విజయసాయి ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఇతర టిడిపి నాయకులను టిడిపిలోను, రాష్ట్రంలోను అత్యంత అవినీతిపరుంటూ ఆయన ఆరోపించారు.

YSRCP MP digs at Sujana Choudhary, Vijayasai Reddy slams Sujana for duping banks for thousands of crores