Saturday, April 20, 2024

యువరాజ్ ఆల్‌రౌండ్ షో వల్లే..

- Advertisement -
- Advertisement -

Yuvraj singh

 

ముంబై: భారత్ రెండోసారి ప్రపంచకప్ సాధించిందంటే దానికి యువరాజ్ సింగ్ అసాధారణ ఆటనే కీలకమని టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. భారత్ వన్డే ట్రోఫీ గెలిచి తొమ్మిదేళ్లు పూర్తయిన సందర్భంగా రవిశాస్త్రి మీడియాతో ముచ్చటించాడు. సొంత గడ్డపై జరిగిన 2011 ప్రపంచకప్‌లో భారత్ అద్భుత ఆటను కనబరిచి విశ్వవిజేతగా నిలిచిందన్నాడు. ఈ ప్రపంచకప్‌లో సమష్టి పోరాటం వల్లే భారత్ ట్రోఫీని గెలుచుకో గలిగిందన్నాడు. అయితే జట్టు విజయంలో యువారజ్ పాత్ర చరిత్రలో చిరకాలం గుర్తుండి పోతుందన్నాడు. ఇటు బంతితో అటు బ్యాట్‌తో యువరాజ్ ఆకాశమే హద్దుగా చెలరేగి పోయాడన్నాడు. అతని ప్రతిభను ఎంత పొగిడినా తక్కువేనన్నాడు. ఇక, సచిన్, గంభీర్, జహీర్, ధోనీ తదితరులు కూడా జట్టు విజయంలో తమవంతు పాత్ర పోషించారన్నాడు. ఈ విజయంతో తనను ఎంతో ఆనందానికి గురిచేసిందన్నాడు. సమష్టి పోరాటం వల్లే భారత్ రెండోసారి ప్రపంచకప్‌ను సాధించిందన్నాడు.

Yuvraj singh game is key to India’s second World Cup win
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News