అంతర్జాతీయ క్రికెట్లో ఒకే ఓవర్లో ఆరు సిక్సులు బాదిన బ్యాట్స్‌మెన్ అనగానే ముందుగా గుర్తొచ్చే పేరు భారత డాషింగ్ ఆటగాడు యువరాజ్ సింగ్. యువీ బ్యాట్‌పట్టి క్రీజ్‌లో అడుగు పెడుతున్నాడంటే గ్రౌండ్లో పరుగుల వరద తప్పదూ. ఒక బ్యాటింగ్ మాత్రమే కాదు బౌలింగ్‌లోనూ యువీ తనదైన శైలీ దూకుడుతో బ్యాట్స్మెన్లు పెవీలియన్ బాట పట్టిస్తుంటాడు. గత కొంతకాలంగా యువరాజ్‌కు భారత జట్టులో స్థానం దక్కలేదు. తాజాగా భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగే మ్యాచ్‌లలో యువి మరోసారి తన ఆటతో అభిమానులను అలరించబోతున్నాడు.
సరే ఇన్నాళ్లకు యువీ తిరిగి మైదానంలో చెలరేగిపోతాడని ఆనందపడేలోపే.. తన అభిమానులకు మాత్రమేకాదు భారత్ క్రికెట్ అభిమానులకే షాక్ ఇచ్చాడు. ఇప్పటికే ఎన్నో రికార్డులను తన వేసుకున్న యువరాజ్ త్వరలో రిటైర్మెంట్ ప్రకటనున్నాడట. 2019 వరల్డ్ కప్ తర్వాత యువరాజ్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలుగుతున్నాడనే వార్త ప్రస్తుతం సోషల్‌మీడియాలో హల్చల్ చేస్తుంది. యువరాజ్ 2019 వరల్డ్ కప్ తర్వాత రిటైర్ అవుతున్నట్లు అధికారికంగా ప్రకటించాడన్న వార్త ప్రస్తుతం అతని అభిమానుల్లో షాక్‌కి గురి చేస్తుంది. అయితే యువీ నిజంగానే ఈ విషయాన్ని ప్రకటించాడా.. లేక కొంతమంది కావాలనే ఈ వార్తలు పుట్టిస్తున్నారా.. అన్న విషయంపై ఇంకా క్లారిటీ లేదు.
మరోవైపు ధోని కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాకే, యువీకి జట్టులో స్థానం దక్కిందనే వార్తలు కూడా దుమారం రేపిన విషయం తెలిసిందే. అయితే ఈ వార్తలను యువరాజ్ తీవ్రంగా ఖండించాడు. ధోనికి తనకు జట్టులో స్థానం దక్కకపోవడానికి సంబంధం లేదని, ధోని అతడు మంచి స్నేహితులని యువీ పేర్కొన్న విషయం తెలిసిందే.