ముంబయి: భారత క్రికెటర్, యువరాజ్ సింగ్‌ను బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ పొగడ్తలతో ముంచేత్తారు. ‘యువరాజ్ సింగ్ నేటి ఛాంపియన్’ అంటూ తన అధికారిక ట్విట్టర్లో అభినందించాడు. గురువారం కటక్‌లో ఇంగ్లండ్ జట్టుతో భారత్‌కు జరిగిన రెండవ వన్డే మ్యాచ్‌లో యువరాజ్ సింగ్ (150) పరుగుల వరద పారించి భారత్‌ను విజయతీరాలకు చేర్చిన సంగతి తెలిసిందే. అద్భుతమైన తన ఆటతీరుతో యావత్తూ ప్రపంచాన్ని తనవైపే తిప్పుకున్న యువరాజ్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది. తన ఆట తీరుతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసి ఛాంపియన్‌గా తన సత్తాను నిరూపించుకున్నాడంటూ అమితాబ్ కొనియాడాడు. నేటి అసాధారణమైన ఛాంపియన్ యువీ అని మరో ట్విట్ చేశాడు. నమ్మశక్యంగానీ రీతిలో బ్రిటిష్‌ను మట్టికరిపించి అంకితభావం, సమయస్ఫూర్తితో అసాధారణ ఘనతను సాధించిన యువరాజ్ సింగ్‌ను అమితాబ్ తన ట్విట్లతో అభినందించాడు.
యువరాజ్ సింగ్ నేటి ‘ఛాంపియన్’ : అమితాబ్ బచ్చన్
- Advertisement -
- Advertisement -