Saturday, April 20, 2024

బిగ్‌బాష్ లీగ్‌లో యువరాజ్?

- Advertisement -
- Advertisement -

Yuvraj Singh to play BIg Bash 2020 League?

ముంబై: భారత డాషింగ్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ ప్రతిష్టాత్మకమైన ఆస్ట్రేలియా బిగ్‌బాష్ లీగ్‌లో ఆడాలని భావిస్తున్నాడు. ఈ విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియానే స్వయంగా ప్రకటించింది. యువరాజ్ కోసం ఫ్రాంచైజీని వెతికి పెట్టే పనిలో క్రికెట్ బోర్డు నిమగ్నమైనట్టు తెలిసింది. భారత్‌కు వన్డే, టి20 ప్రపంచకప్‌లు అందించడంలో యువరాజ్ కీలక పాత్ర పోషించాడు. భారత క్రికెట్‌పై అతను స్పష్టమైన ముద్రవేశాడు.

అంతేగాక ఐపిఎల్ టి20 టోర్నమెంట్‌లో కూడా ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టాడు. ఇటీవలే యువరాజ్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. దీంతో విదేశీ లీగ్‌లలో ఆడేందుకు అతనికి మార్గం సుగమం అయ్యింది. కాగా ఐపిఎల్ తర్వాత అంతటి పేరున్న బిగ్‌బాష్ టి20 లీగ్‌లో ఆడేందుకు యువరాజ్ ఆసక్తి కనబరుస్తున్నాడు. దీన్ని క్రికెట్ ఆస్ట్రేలియా స్వాగతించింది. ఇదే జరిగితే బిగ్‌బాష్ అభిమానులకు యువరాజ్ స్టయిలీష్ బ్యాటింగ్ చేసే అవకాశం దక్కుతుంది.

Yuvraj Singh to play BIg Bash 2020 League?

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News