Thursday, April 18, 2024

సోని పిక్చర్స్ లో విలీనం కానున్న జీ

- Advertisement -
- Advertisement -

zee sony merger
బెంగళూరు: జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్(జెడ్‌ఇఇఎల్) త్వరలో సోనీ పిక్సర్స్ నెట్‌వర్క్ ఇండియా(ఎస్‌పిఎన్‌ఐ)లో విలీనం కానున్నది. జీ కంపెనీ బోర్డ్ బుధవారం సూత్రప్రాయంగా తన ఆమోదాన్ని తెలిపింది. జీ ప్రస్తుతం టెలివిజన్ ప్రసారం, డిజిటల్ మీడియాలో జీటివి బ్రాండ్‌తో పనిచేస్తోంది. అయితే కంపెనీ బోర్డులో నుంచి సిఇఒ పునీత్ గోయెంకా తప్పుకోవడం సహా మేనేజ్‌మెంట్‌లో మార్పు అవసరమని పెట్టుబడి ఎక్కువ పెట్టిన మదుపరుల(టాప్ ఇన్వెస్టర్స్) నుంచి ఒత్తిడి వచ్చింది.
తమ లీనియర్ నెట్‌వర్క్, డిజిటల్ ఆస్తులు, ప్రొడక్షన్ కార్యకలాపాలు, ప్రొగ్రామ్ లైబ్రరీలను కలిపేందుకు సోని పిక్సర్స్ నెట్‌వర్క్ ఇండియా ఓ నాన్-బైండింగ్ టర్మ్ ఒప్పందాన్ని చేసుకుందని జీ ఎంటర్‌టైన్‌మెంట్ లిమిటెడ్ స్టాక్ ఎక్స్‌ఛేంజ్‌కు సమర్పించిన దస్తావేజుల్లో పేర్కొంది. కాగా ఈ ప్రతిపాది ఒప్పందం వల్ల జీ షేర్ హోల్డర్స్‌కు 47.07 శాతం వాటాయే ఉండగలదు. మిగతా జీ కంపెనీ వాటాలను సోని పికర్స్ నెట్‌వర్క్ ఇండియా షేర్ హోల్డర్లు దక్కించుకుంటారు. కాగా ఈ రెండు సంస్థల మధ్య ఒప్పందం, ఇతర అంశాలు ఖరారు కావడానికి 90 రోజుల గడువును టర్మ్ షీట్ ఇస్తోంది. విలీనం అయ్యాక ఈ సంస్థ భారత్ లో లిస్టింగ్ కాగలదు. దాని మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(సిిఇఒ)గా పునీత్ గోయెంకా ఉంటారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News