Thursday, March 28, 2024

జింబాబ్వే జయకేతనం

- Advertisement -
- Advertisement -

Zimbabwe win second T20 against Bangladesh

 

హరారే: బంగ్లాదేశ్‌తో శుక్రవారం జరిగిన రెండో ట్వంటీ20లో ఆతిథ్య జింబాబ్వే 23 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో సిరీస్‌ను 11తో సమం చేసింది. తొలి టి20లో బంగ్లాదేశ్ గెలిచిన విషయం తెలిసిందే. రెండో టి20లో ముందుగా బ్యాటింగ్ చేసిన జింబా బ్వే ఆరు వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. ఓపెనర్ వెస్లీ మధేవర్ అద్భుత బ్యాటింగ్‌తో జట్టు ను ఆదుకున్నాడు. బంగ్లా బౌలర్ల ను దీటుగా ఎదుర్కొన్న వెస్లీ ఐదు ఫోర్లు, మూడు సిక్స్‌లతో 73 పరు గులు చేశాడు. చివర్లో రియాన్ బూరి రెండు సిక్స్‌లు, మరో 2 ఫోర్ల తో 19 బంతులలోనే అజేయంగా 34 పరుగులు సాధించాడు. డియాన్ మైయర్స్ (26) కూడా తనవంతు పాత్ర పోషించడంతో జింబాబ్వ స్కోరు 166 పరుగులకు చేరింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ 19.5 ఓవర్లలో 143 పరుగులకే ఆలౌటైంది. జింబాబ్వే బౌలర్లు అద్భుత బౌలింగ్‌తో బంగ్లా ఇన్నింగ్స్‌ను తక్కువ పరుగులకే కుప్పకూల్చారు. జొంగ్వే, మసకద్జా మూడేసి వికెట్లు తీయగా, టెండాయి చటారా, ముజర్బానిలకు రెండేసి వికెట్లు లభించాయి. బంగ్లా జట్టులో షమీమ్ (29), అఫిఫ్ (24) మాత్రమే కాస్త రాణించారు.మిగతావారు విఫలం కావడంతో బంగ్లాకు ఓటమి తప్పలేదు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News