Home జాతీయ వార్తలు పెరుగుతున్న డెంగ్యూ కేసులు… జొమాటోకు రూ. లక్ష జరిమానా

పెరుగుతున్న డెంగ్యూ కేసులు… జొమాటోకు రూ. లక్ష జరిమానా

 

చెన్నై: ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటోకు భారీ షాక్ తగిలింది. డెంగ్యూ వ్యాధి వ్యాపించేందుకు జోమాటో బ్యాగులు కారణమవుతున్నాయని ఆ సంస్థకు చెన్నై కార్పొరేషన్ లక్ష రూపాయలు ఫైన్ వేసింది. ప్రస్తుతం చెన్నైలో డెంగ్యూ కేసులు అధిక సంఖ్యలో పెరుగుతున్నాయి. దీంతో డెంగ్యూకు కారణమయ్యే దోమల్ని కంట్రోల్ చేసేందుకు చెన్నై కార్పొరేషన్ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో ప్రతీ ఆఫీసు, ఇళ్ల ఆవరణాలను అధికారులు తనిఖీలు చేస్తూ ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. ఈ క్రమంలో ఏ సంస్థైనా, ఆఫీసైనా దోమలు పెరిగేందుకు కారణమైనట్లు కనిపించినా నగర కార్పొరేషన్ రూ.లక్ష వరకు జరిమానా విదిస్తోంది.

కాగా, చెట్‌పేట్‌లోని మాక్నీకోలాస్ రోడ్ సమీపంలోని జొమాటో కార్యాలయం చుట్టు ప్రక్కల డెంగ్యూ కేసులు పెరుగుతుండడం గమనించిన అధికారులు జొమాటో ఆఫీసును తనిఖీ చేశారు. జొమాటో డెలివరీ బాయ్స్… ఫుడ్ డెలివరీ కోసం ఉపయోగిస్తున్న బ్యాగులు పాడైపోయిన తర్వాత వాటిని ఆఫీస్ ఆవరణలో పారేస్తున్నట్లు గుర్తించారు. ఆ బ్యాగుల్లో వర్షం నీరు నిలిచిపోయి దోమలు పెరుగుతున్నాయని, దీంతో ఆఫీసు సమీపంలో డెంగ్యూ కేసులు పెరుగుతున్నాయని జొమాటోకు నగర కార్పోరేషన్ రూ.లక్ష జరిమానా వేసింది.

Zomato fined Rs 1 lakh for Mosquito Genic in Chennai