Home తాజా వార్తలు జొమాటో ఆదాయం రెట్టింపు

జొమాటో ఆదాయం రెట్టింపు

Zomato Revenue Jumps to $394 Million in FY20

 

న్యూఢిల్లీ : గత ఆర్థిక సంవత్సరం (2019-20) మార్చి ముగింపు నాటికి ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జోమాటో ఆదాయం 105 శాతం పెరిగి 394 మిలియన్లు (రూ. 2,960 కోట్లు) నమోదైంది. ఏడాది క్రితం సంస్థ ఆదాయం రూ.1,440 కోట్ల ఆదాయంతో పోలిస్తే ఇది రెట్టింపు అయింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21) మొదటి త్రైమాసికంలో కరోనా వైరస్ ప్రభావం వల్ల ఆదాయం 40 మిలియన్ డాలర్లు మాత్రమే నమోదైంది. అయితే ఈ కాలంలో కంపెనీ ఎబిటా నష్టాలు 293 మిలియన్లు.

జూలైలో 23 మిలియన్ డాలర్ల ఆదాయాన్ని పొందుతుందని అంచనా వేసినట్లు కంపెనీ తెలిపింది. వ్యాపారాన్ని లాభాల వైపు తీసుకెళ్లడమే తన ప్రధాన లక్ష్యమని, ఈ విషయంలో తాము మంచి పురోగతి సాధించానని జోమాటో పేర్కొంది. 2021 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో కంపెనీ ఆర్డర్‌కు రూ .27 లాభం ఆర్జించింది, ఏడాది క్రితం ఇదే కాలంలో ఆర్డర్‌కు రూ .47 నష్టం వాటిల్లింది. రాబోయే నెలల్లో పూర్తిస్థాయిలో కోలుకుంటామని కంపెనీ తెలిపింది. వ్యాపారం రికవరీ ప్రారంభమైన వెంటనే ఉద్యోగుల జీతాన్ని మునుపటి స్థాయికి తీసుకువస్తామని కంపెనీ తెలిపింది.

Zomato Revenue Jumps to $394 Million in FY20