Home తాజా వార్తలు జొమాటో గ్రాసరీ డెలివరీ సేవలు బంద్

జొమాటో గ్రాసరీ డెలివరీ సేవలు బంద్

Zomato to stop grocery delivery service from 17 sept

 

న్యూఢిల్లీ : కిరాణా వస్తువుల డెలివరీ సేవలను మూసివేయాలని జోమాటో నిర్ణయించింది. ఫుడ్ డెలివరీ సేవల సంస్థ జొమాటో ఈ సేవలను 2021 జూలైలో ప్రారంభించింది. అయితే ఇటీవల కాలంలో కిరాణ వస్తువుల ఆర్డర్లు, 15 నిమిషాల్లో డెలివరీ సేవలను నెరవేర్చలేకపోవడం వల్ల ఈ సేవలను మూసివేయనున్నట్టు తన గ్రాసరీ స్టోర్ భాగస్వాములకు ఇమెయిల్ ద్వారా జొమాటో తెలియజేసింది. ఈ నెల 17 నుంచి జొమాటో గ్రాసరీ డెలివరీ సేవలను మూసివేయనున్నట్టు కంపెనీ ప్రకటించింది. జొమాటో అధికార ప్రతినిధి తెలిపిన ప్రకారం, గ్రాసరీ పైలట్‌ను మూసివేయనున్నాం, జొమాటో ప్లాట్‌ఫామ్‌పై ఇతర విధానాల్లో కిరాణా డెలివరీ చేసే యోచన కూడా లేదు. 10 నిమిషాల గ్రాసరీలో అత్యున్నత నాణ్యతా మార్కెట్‌ను గ్రోఫర్స్ కనుగొన్నదని, సంస్థ ఇన్‌హౌస్ గ్రాసరీ ప్రయత్నం కంటే ఆ కంపెనీలో తమ పెట్టుబడులు వాటాదారులకు మంచి ఫలితాలను ఇస్తాయని నమ్ముతున్నామని ప్రతినిధి అన్నారు.

Zomato to stop grocery delivery service from 17 sept