Tuesday, March 21, 2023

జడ్‌పి సమావేశంలో రేగిన..సమస్యల జ్వాల

- Advertisement -

speak*ఉద్యోగం చేస్తూ ఫైనాన్స్ చేసిన టీచర్‌పై చర్యలెక్కడ..?

*పర్యవేక్షణ లోపమే సమస్యలకు కారణం

*ధాన్యం కొనుగోలులో దళారులకు ప్రోత్సాహం

*మంత్రి ప్రారంభించినా..సేవలు శూన్యమే

*మేం తెస్తున్నాం.. మీరు ఆపుతున్నారు

*గొర్రెల పథకంలో కొనసాగుతున్న అక్రమాలు

మన తెలంగాణ/సంగారెడ్డి : తోటి మహిళా సిబ్బంది పట్ల ఉపాధ్యాయుడు తప్పుగా వ్యవహరించాడని గత ఐదునెలల క్రితం ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం సంబంధిత అధికారులు విఫలం కావడంతో మరో ఉపాధ్యాయు డు విద్యార్థినిల పట్ల అసభ్యంగా ప్రవర్తించడానికి పూనుకున్నాడని దీనిపై విచారణ చేసి సంబంధికులపై చర్యలు తీసుకోవాలని జడ్‌పిటిసి సభ్యులు, ఎంపిపి లు పేర్కొన్నారు. శుక్రవారం ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజాపరిషత్ సర్వసభ్య స మావేశం జడ్‌పి చైర్‌పర్సన్ రాజమణీ మురళీయాదవ్ అధ్యక్షతన డిప్యూటీ స్పీకర్ పద్మదేవేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యాశాఖలో పనిచేస్తున్న పటాన్‌చెరు నియోజకవర్గలోని ఓ పాఠశాల ఉపాధ్యాయు డు రాములు ఎంఈవో కార్యాలయంలో టైపిస్ట్ విధులు నిర్వహిస్తున్న మహిళా ఉద్యోగిపట్ల అసభ్యంగా ప్రవర్తించాడని మండల పరిషత్ సమావేశంలో తీర్మా ణం చేసి పంపినా ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదని మండల ఎంపిపి డీఈవోను నిలదీశారు. అతడికి భయపడి రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. కాగా అదే మండలంలో మరో పాఠశాలలో సంజీవ్‌రెడ్డి అనే ఉపాధ్యాయుడు విద్యార్థినిల పట్ల అసభ్యంగా ప్రవర్తించడానికి ఉన్నతాధికారుల నిర్లక్షమే కారణమంటూ ఆరోపించారు. ఫిర్యాదు చేసినప్పటికీ చర్యలు తీసుకోకపోవడంలో అంతర్యమేమిటని ప్రశ్నించారు. ఐదు నెలలు గడుస్తున్నప్పటికీ చర్యలు తీసుకోవడానికి వెనుకడుగు వేస్తున్న విద్యాధికారుల నిర్లక్ష్యానికి కారణాలు చెప్పాల్సిన అవసరముందన్నారు. దీనికి డీఈవో విజయకుమారి సమాధానంగా ఒక ఉ ద్యోగిపై చర్యలు తీసుకునే ముందు విచారణ కమిటీ వేయడం జరుగుతుందని, వారిచ్చిన నివేధిక ఆధారంగా ఖచ్చితంగా చ ర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. దీనికి స భ్యులు తక్షణమే రాములు, సంజీవరెడ్డి అనేఉపాధ్యాయులను సస్పెండ్ చేయాలని డిమాం డ్ చేయగా కలెక్టర్ మాణిక్కరాజ్ కణ్ణన్ కలుగజేసుకొని ఒక ఉద్యోగిని తక్షణమే సస్పెండ్ చే స్తే తిరిగి యథావిధిగా విధులు నిర్వహించేందుకు అవకాశం ఉన్నందున విచారణ కమిటీ ఇచ్చిన నివేధిక ఆధారంగా చర్యలు తీసుకోవడంతో పకడ్బంధీగా ఉంటుందన్నారు. దీంతో మరో ఏ ఉద్యోగి అయినా ఇలాం టి సంఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయన్నారు.
పౌరసరఫరాలో రెచ్చిపోతున్న దళారులు
రేషన్ బియ్యం సరఫరాలో ప్రభుత్వమే ధాన్యాన్ని కొనుగోలు చేసి బియ్యాన్ని సరఫరా చేయడం జరుగుతుందని, కానీ మెదక్ జిల్లాలో ప్రైవేట్ రైస్‌మిల్లుల నుండి అధికారులు బియ్యాన్ని కొనుగోలు చేసి సరఫరా చేయడంపై కొల్చారం జడ్‌పిటిసి శ్రీనివాస్‌రెడ్డి అధికారులను నిలదీశారు. సరిపోయేంత ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నప్పటికీ తిరిగి ప్రైవేట్‌గా ఎందుకు కొనుగోలు చేస్తున్నారో వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో అధికారులు పొంతలు లేని సమాధానం చెప్పడంతో డిప్యూటీ స్పీకర్, కలెక్టర్లు కలుగుజేసుకొని వాటికి సంబంధించిన వివరాలు తెలుపాలని అధికారులను ఆదేశించారు.
గొర్రెల కొనుగోలు, ఇన్సూరెన్స్‌లో అక్రమాలు.. : గొర్రెల కొనుగోలు, మృతిచెందిన గొర్రెల ఇన్సూరెన్స్ విషయంలో అవకతవలు, అక్రమాలు చాలా వరకు జరుగుతున్నాయని, దీనిలో అధికారులే దళారులను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. దీనికి అధికారులు సమాధానంగా జిల్లాలో ఇన్సూరెన్స్ 4325 ఫిర్యాదులు రాగా 2861 గ్రౌండింగ్ అయ్యాయని, అందులో 454 క్లైమ్ చేయడం జరిగిందని అధికారులు సూచించారు. కాగా గొర్రెలకు అస్వస్థత ఏర్పడినపుడు 1962 వాహనం సరైన సేవలు అందించడం లేదని, ఒక్క గ్రామానికి వచ్చినపుడు ఆ గ్రామంలో ఉన్న అన్ని గొర్లకు వైద్యసేవలందించకుండా నిర్లక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. దీనికి డిప్యూటీ స్పీకర్ స్పందిస్తూ ఒక గ్రామానికి వెళ్లినపుడు అక్కడున్న అన్ని గొర్లకు వైద్యం చేసి కావాల్సిన సలహాలు, సూచనలు ఇచ్చే విదంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
నీమ్‌కోటెడ్ ఎరువులు వాడేలా చూడాలి : కాగా మెదక్ ఎంపీ కొత్తప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం నీమ్‌కోటెడ్ ఎరువులపై జీఎస్టీ భారీగా తగ్గించిందని జిల్లాలో రైతులు నిమ్‌కోటెడ్ ఎరువులను చాలా వరకు వా డే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులకు సూచించారు. చి న్నకారు రైతులకు అవసరమయ్యే పనిముట్లను అధికారులు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతులకు నష్టపరిహారం ఇవ్వడంలో జాప్యం జరుగుతుందని సభ్యులు ఆరోపించారు. ఈ విషయాలపై త్వరలో పరిష్కారమయ్యే విధంగా చూడాలని డిప్యూటీ స్పీకర్ అధికారులను సూచించారు.
సింగూరు నీటి తరలింపుపై.. : కాగా నారాయణ్‌ఖేడ్ ఎంపీపీ సంజీవ్‌రెడ్డి మాట్లాడుతూ మంజీరా నుండి నీళ్లను ఎస్‌ఆర్‌ఎస్‌కి తరలించి నారాయణ్‌ఖేడ్ ప్రాంతంలోని ప్రజలకు తీవ్ర నష్టం కలిగే విధంగా వ్యవహరించారని ఆరోపించగా డిప్యూటీస్పీకర్ మాట్లాడుతూ తెలంగాణ జిల్లాలోని రైతులందరు బాగుండాలని రాష్ట్రప్రభుత్వం జిల్లాకు అవసరమైన 15 టీఎంసీల సింగూర్ నీటిని వదిలేస్తూ, మిగిలిన నీటిని మాత్రమే ఎస్‌ఆర్‌ఎస్పీకి తరలించారని తెలిపారు. కాగా కల్హేర్ జెడ్పీటీసీ మాట్లాడుతూ చేసి న పనులకు సంబంధించి బిల్లుల మంజూరులో అధికారులు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని, అందుబాటులో లేని సమయంలో ఫోన్ చేస్తే అసభ్యంగా మాట్లాడుతున్నారని డిప్యూటీ స్పీకర్, కలెక్టర్, జెడ్పీ చైర్మన్‌ల ముందు ఆవేధన వ్యక్తం చేశారు. దీంతో సంబంధిత పీఆర్‌ఈఈ వేణుమాధవ్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సమావేశ అనంతరం తనను కలవాల ని ఆదేశించారు. సమావేశంలో జడ్‌పి సీఈవో రవి, ఎంపి బీబీ పాటిల్, ఎమ్మెల్యేలు చింతాప్రభాకర్, మదన్‌రెడ్డి, బాబుమోహన్, ఎమ్మెల్సీలు భూపాల్‌రెడ్డి, రాములు నాయక్, జడ్‌పి ఉపాధ్యక్షుడు రాగుల సారయ్య, జెడ్పీటీసీలు శ్రీకాంత్‌గౌడ్, మనోహర్‌గౌడ్, ప్రభాకర్, అంజయ్య, ముక్తా ర్, జయలక్ష్మీ, ఎంపీపీ విఠల్, లక్ష్మమ్మ, తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News