Friday, September 13, 2024

విప్రోలో ఉద్యోగాలు..

- Advertisement -
- Advertisement -

దేశంలోనే మూడో అతిపెద్ద ఐటీ కంపెనీ విప్రో. ఇప్పుడు ఇందులో బంపర్ ఉద్యోగాలు రానున్నాయి. బెంగళూరుకు చెందిన ఈ సంస్థలో 2025 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 10,000-12,000 మందికి ఉద్యోగాలు రానున్నాయి. దీనికి సంబంధించి ఐటి కంపెనీ విప్రో జాబ్ ఆఫర్లు ఇచ్చిన ఫ్రెషర్లకు కంపెనీ మొదటి ప్రాధాన్యత ఇస్తుందని ప్రకటించింది. కాగా, 2025 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో 3,000 మంది, తర్వాత నెక్స్ట్-జెన్ అసోసియేట్స్ (NGA) అంటే ఫ్రెషర్లు ఉద్యోగాలు పొందుతారు.

మొత్తం 10,000-12,000 NGA రిక్రూట్‌మెంట్‌లు ఉంటాయని విప్రో తెలిపింది. ఈ జాబ్ నియామకాలు GenAI, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ విభాగాలలో ఉంటాయి. ఐటి రంగాలలో నిరంతరం ఉద్యోగాలు కోల్పోతున్న నేపథ్యంలో విప్రో యొక్క ఈ ఆఫర్ నిరుద్యోగులకు శుభవార్త అని చెప్పవచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News