మనతెలంగాణ, సిటిబ్యూరోః సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న పదిమంది ఇన్స్‌స్పెక్టర్లను బదిలీ చేస్తూ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి ఆదేశాలు జారీ చేశారు. కూకట్‌పల్లి ఎస్‌హెచ్‌ఓ రాజేష్‌ను సిసిఎస్ రాజేంద్రనగర్‌కు, కూకట్‌పల్లి ఇన్స్‌స్పెక్టర్‌గా కె.వెంకటసుబ్బారావును నియమించారు. మియాపూర్ ఇన్స్‌స్పెక్టర్ క్రాంతి కుమార్‌ను సిసిఆర్‌బికి బదిలీ చేసి, శివప్రసాద్‌ను ఎస్‌హెచ్‌ఓగా, అల్వాల్ ఇన్స్‌స్పెక్టర్ రాహుల్ దేవ్‌ను బదిలీ చేసి, ప్రశాంత్‌ను అల్వాల్ ఎస్‌హెచ్‌ఓగా నియమించారు. విజయ్‌కుమార్‌ను సైబర్ క్రైం ఇన్స్‌స్పెక్టర్‌గా, సైబర్ క్రైంలో ఉన్న శ్రీనివాస రావును బాలానగర్ ట్రాఫిక్ ఇన్స్‌స్పెక్టర్‌గా, బాలానగర్ ట్రాఫిక్ ఇన్స్‌స్పెక్టర్ సురేష్‌ను బాచుపల్లి డిఐగా, బాచుపల్లి డిఐ యాదయ్య గౌడ్‌ను సిఎస్‌డబ్లూకు బదిలీ చేశారు. బదిలీ అయిన ఇన్స్‌స్పెక్టర్లు వెంటనే వారి స్థానాల్లో చేరాలని ఆదేశించారు.
సైబరాబాద్‌లో పదిమంది ఇన్స్‌స్పెక్టర్ల బదిలీ
- Advertisement -
- Advertisement -
- Advertisement -