Monday, July 28, 2025

పాకిస్థాన్‌లో రోడ్డు ప్రమాదంలో 10 మంది మృతి

- Advertisement -
- Advertisement -

పాకిస్థాన్‌లో ఆదివారం జరిగిన బస్సు రోడ్డు ప్రమాదంలో కనీసం పది మంది మృతి చెందగా, 30 మందికిపైగా గాయపడ్డారని అధికారులు తెలిపారు. 40 మంది ప్రయాణీకులతో ఇస్లామాబాద్ నుంచి లాహోర్‌కు వెళుతున్న బస్సు పంజాబ్ ప్రాంతానికి చెందిన చక్‌వాల్ జిల్లాలోని బాల్‌కస్సర్ వద్ద లోయలో పడిపోయింది. టైరు పేలిపోవడంతో బస్సు డ్రయివర్ అదుపు తప్పాడని, దాంతో బస్సు బోల్తా కొట్టిందని అత్యవసర సేవల విభాగం ప్రతినిధి తెలిపారు.

చక్‌వాల్ జిల్లా హెల్త్ అథారిటీ(డిహెచ్‌ఎ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డాక్టర్ సయీద్ అఖ్తర్ తన ప్రకటనలో ‘తొమ్మిది మంది చనిపోయారు, 30 మంది గాయపడ్డారు’ అని పేర్కొన్నారు. చనిపోయినవారిలో ఎనిమిది మంది అక్కడికక్కడే చనిపోగా, ఒక్కరు మాత్రం చక్‌వాల్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. పాకిస్థాన్‌లో నిర్లక్షంగా వాహనాలు నడపడం, రోడ్డు కండిషన్ పేలవంగా ఉండడం వల్ల తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయన్నది గమనార్హం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News