Friday, September 12, 2025

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్/చర్ల : మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలో మరో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. గరియాబంద్ జిల్లా గరియాబాద్‌లో పోలీ స్ బలగాలకు, మావోయిస్టులకు జరిగిన ఎన్ కౌంటర్ లో పది మంది మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో మావోయి స్టు కేంద్ర కమిటీ సభ్యుడు, మనోజ్ కూడా అలియాస్ మోడెం బాలకృష్ణ తో పాటు ఒరిస్సా రాష్ట్ర కమిటీ సభ్యుడు ప్రమోద్ యారఫ్ అలియాస్ పాండు మృతి చెందినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ఎన్‌కౌంటర్‌లో వరంగల్ ఘన్‌పూర్‌కు చెందిన మ నోజ్ మృతి చెందినట్లు బలాగాలు గుర్తించాయి. మనోజ్‌ను బాలన్న, రామ చందర్, భాస్కర్ అనే పలు పేర్లతో పిలుస్తారు. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్న మనోజ్‌పై రూ.2 కోట్ల వరకు రివార్డు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఒడిశా, ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో మనోజ్ చురుకుగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

కేంద్ర కమిటీలో కీలక సభ్యుడైన మనోజ్ మృతితో మావోయిస్టుల కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. 10 మంది మావోయిస్టులను భద్రతాదళాలు మట్టుబెట్టాయాని గరియాబంద్ ఎస్పీ నిఖిల్ రఖేచా తెలిపారు. ఉదయం నుండి భద్రతా దళాలు మావోయి స్టులకు ఎదురుకాల్పులు జరిగాయి. థానా మెయిన్‌పూర్ ప్రాంతంలోని అడవుల్లో మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో గరియాబంద్ ఇ30, ఎస్‌టిఎఫ్, కోబ్రా బలగాలు సెర్చ్ ఆపరేషన్‌ను మొదలుపట్టాయి. ఇప్పటివరకు 10 మంది మృతదేహాలను ఆటోమేటిక్ ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. మృతుల్లో ఎవరెవరు ఉన్నారనేది అధికారికంగా ఇంకా నిర్ధారించలేదు. గరియాబంద్ జిల్లా ఎస్‌పిస నిఖిల్ రఖేచా ప్రకారం, ఈ ఎన్‌కౌంటర్ గురువారం ఉదయం నుంచి మైన్‌పూర్ ప్రాంతంలోని దట్టమైన అడవుల్లో జరిగింది. మావోయిస్టులు ఈ ప్రాంతంలో ఉన్నారని నిర్దిష్టమైన ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగా, ఛత్తీస్‌గఢ్ పోలీసుల ఈ-30 యూనిట్, స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్‌టిఎఫ్), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సిఆర్‌పిఎఫ్), కమాండో బెటాలియన్ ఫర్ రిజల్యూట్ యాక్షన్ (కోబ్రా) సంయుక్తంగా ఈ ఆపరేషన్‌ను చేపట్టాయి.

Also Read: మోహన్ భగవత్‌కు 75 ఏండ్లు.. ప్రత్యేక వ్యాసంతో మోడీ విషెస్

ఈ ఆపరేషన్ బుధవారం రాత్రి నుంచి ప్రారంభమై గురువారం ఉదయం తీవ్రమైన కాల్పులతో ఉధృతమైంది. ‘ఈ ఆపరేషన్ సమయంలో భద్రతా బలగాలు మావోయిస్టులతో భీకర కాల్పులు జరిపాయి. ఇప్పటివరకు 10 మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నాము, పలు ఆటోమేటిక్ ఆయుధాలు కూడా స్వాధీనం చేసుకున్నాము,‘ అని బలగాల ఉన్నతాధికారులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న ఆయుధాల్లో ఎకె-47లు, ఇన్సాస్ రైఫిల్స్, ఎస్‌ఎల్‌ఆర్‌లులు, ఇతర ఆధునిక ఆయుధాలు ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. మావోయిస్టు సీనియర్ కమాండర్ మనోజ్ అలియాస్ మోడెం బాలకృష్ణ ఈ ప్రాంతంలో ఉన్నాడని నిర్దిష్ట సమాచారం ఆధారంగా ఈ ఆపరేషన్ ప్రారంభమైంది. ఆయన సారథ్యంలో ఈ ప్రాంతంలో మావోయిస్టు కార్యకలాపాలు ఊపందుకున్నాయని ఇంటె లిజెన్స్ రిపోర్టులు సూచించాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో అతనితో పాటు ఒడిశా స్టేట్ కమిటీ సభ్యుడు ప్రమోద్ అలియాస్ పాండు కూడా మృతి చెందినట్లు అనధికారిక సమాచారం ఉంది, అయితే ఈ విషయంపై అధికారిక ధృవీకరణ ఇంకా రాలేదు.

అయితే భద్రతా సిబ్బంది, మావోయి స్టుల మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఎదురు కాల్పులు ముగిసిన తర్వాతే మృతులపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశముం దని తెలుస్తోంది. ఈ ఎన్‌కౌంటర్ ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టు కార్యకలాపాలను అరికట్టడానికి భద్రతా బలగాలు చేస్తున్న ప్రయత్నంలో మరో ముందడుగు. 2025లో ఇప్పటివరకు ఛత్తీస్‌గఢ్‌లో 225 మంది మావోయిస్టులు వివిధ ఎన్‌కౌంటర్‌లలో మృతి చెందినట్లు అధికారిక గణాంకాలు సూచిస్తున్నాయి, ఇందులో బస్తర్ డివిజన్‌లో 208 మంది ఉన్నారు. ఇదిలా ఉంటే ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా పార్తాపూర్ ప్రాంతంలో మావోయిస్టులుకు పోలీసులకు మావోయిస్టులకు జరిగిన ఎదురు కాల్పుల్లో ఓ మావోయిస్టు మృతి చెందినట్లు జిల్లా ఎస్పీ ఐకే ఎల్లిసెల ధృవీకరించారు.పార్తాపూర్ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారన్నా పక్కా సమాచారంతో అడవులను జల్లెడ పడుతున్న బలగాలకు మావోయిస్టులు తారసపడడంతో ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయని ఈ క్రమంలో ఓ మావోయిస్టు హతమైనట్లు స్పష్టం చేశారు..

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News