Saturday, May 3, 2025

10 పిహెచ్‌సిలకు ‘ఎన్‌క్వాస్’

- Advertisement -
- Advertisement -

10 PHCs awarded National Quality Assurance Standard Certificate

వైద్యారోగ్య శాఖకు మంత్రి హరీశ్‌రావు అభినందనలు

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలోని మరో 10 పిహెచ్‌సిలకు ఎన్‌క్వాస్ (నేషనల్ క్వాలిటీ అష్యురెన్స్ స్టాండర్డ్) సర్టిఫికెట్ లభించింది. దీంతో రాష్ట్రంలో ఆసుపత్రులు మొత్తం 125 ఆసుపత్రులకు ఈ గుర్తింపు వచ్చింది. ఎన్‌క్వాస్ గుర్తింపు కలిగిన ఆసుపత్రులు అత్యధికంగా ఉన్న రాష్ట్రంగా తెలంగాణ మూడో స్థానంలో నిలిచింది. పిహెచ్‌సిలకు ఎన్‌క్వాస్ గుర్తింపు లభించడం పట్ల రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌రావు హర్షం వ్యక్తం చేశారు. ఇందుకు కృషి చేసిన వైద్య సిబ్బందికి అభినందించారు. రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ ఆసుపత్రులకు ఎన్‌క్వాస్ గుర్తింపు వచ్చేలా ప్రభుత్వం కృషి చేస్తున్నదని,ఆ దిశగా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నదని తెలిపారు.

రాష్ట్రంలో పిహెచ్‌సి స్థాయి నుంచి ప్రజలకు నాణ్యమైన వైద్యం అందుతుందని చెప్పడానికి కేంద్రం ఇచ్చిన ఈ గుర్తింపు నిదర్శనమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఆధ్వర్యంలో రాష్ట్ర వైద్యారోగ్య రంగం దేశానికే ఆదర్శంగా మారుతున్నదని అన్నారు. స్వరాష్ట్రంలో ప్రభుత్వం వైద్యారోగ్య రంగాన్ని పటిష్టం చేస్తున్నదని, దీంతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక వసతులు పెరిగాయని తెలిపారు. విలువైన వైద్య పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. ఒపి, ఐపీ, సర్జికల్ ఇలా అన్ని విభాగాల్లో నాణ్యత పెరిగిందని, దీంతో రాష్ట్ర ప్రజలకు ఉచితంగా, నాణ్యమైన వైద్య సేవలు అందుతున్నాయని పేర్కొన్నారు.

ఎన్‌క్వాస్ గుర్తింపు లభించిన పిహెచ్‌సిలు

1.నల్గొండ నాంపల్లి
2. జనగాం లింగాల ఘన్‌పూర్ పిహెచ్‌సి
3. సంగారెడ్డి కొండాపూర్ పిహెచ్‌సి
4. భద్రాద్రి కొత్తగూడెం పర్నశాల పిహెచ్‌సి
5. జగిత్యాల ఖైలగూడ పిహెచ్‌సి
6. భూపాలపల్లి రేగొండ పిహెచ్‌సి
7. వరంగల్ రూరల్ ఉప్పల్ పిహెచ్‌సి
8. జగిత్యాల పెగడపల్లి పిహెచ్‌సి
9. మేడ్చల్ మల్కాజిగిరి పర్వత్‌నగర్ పిహెచ్‌సి
10. సూర్యాపేట పెన్‌పహాడ్ పిహెచ్‌సి

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News