వింబుల్డన్‌లో 100 విజయాలు నమోదు చేసిన టెన్నిస్ స్టార్‌గా రికార్డు
లండన్: టెన్నిస్ స్టార్ నొవాక్ జొకోవిక్ నయా రికార్డు నెలకొల్పాడు. వింబుల్డన్ టెన్నిస్ టోర్నమెం ట్ చరిత్రలో 100 విజయాలు సాధించిన మూడో ఆటగాడిగా నొవాక్ చరిత్ర సృష్టించాడు.మూడో రౌండ్‌లో సొంత దేశ(సెర్బియా) ఆటగాడు మియోమిర్ కెమనోవ్పిపై 6-3, 6-0, 6-4 తేడాతో గెలుపొందడం ద్వారా ఈ ఘనతను సాధించాడు. జకోవిచ్ కంటే ముందు మార్టీనా నవ్రతిలోవా, రోజర్ ఫెదరర్ మాత్రమే ఈ మైలురాయిని చేరుకున్నారు.
మట్టి కోర్టులోనూ..
గత నెలలో జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లో నొవాక్ జకోవిచ్ మట్టి కోర్టులో తన 100వ మ్యాచ్ విజయాన్ని సాధించాడు. బెల్గ్రేడ్‌కు చెందిన నొవాక్ జకోవిచ్, రోజర్ ఫెదరర్ మాత్రమే రెండు వేర్వేరు గ్రాండ్‌స్లామ్‌లలో 100 మ్యాచ్‌లు గెలిచిన ఆటగాళ్లుగా నిలిచారు. రోలాండ్ గారోలో జానిక్ సిన్నర్ చేతిలో సెమీ-ఫైనల్లో ఓడిపోయే ముందు నొవాక్ జకోవిచ్ తన 101వ విజయాన్ని నమోదు చేసుకున్నాడు. ఇక మరో ప్రతిష్ఠాత్మ గ్రాండ్‌స్లామ్ ఆస్ట్రేలియా ఓపెన్‌లో ఈ ఫీట్ సాధించేందకు ఒక్క విజయం దూరంలో ఉన్నాడు. యూఎస్ ఓపెన్‌లో ఈ ఘనతకు 10 విజయాల దూరంలో ఉన్నాడు నొవాక్.