Wednesday, August 13, 2025

రోడ్డు ప్రమాదంలో 11 మంది దుర్మరణం

- Advertisement -
- Advertisement -

రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. దౌసాలో జరిగిన ఈ దుర్ఘటనలో 11 మంది దుర్మరణం చెందారు. ఎనిమిది మంది తీవ్ర గాయాలపాలయ్యారు. మృతుల్లో ఏడుగురు చిన్నారులు, నలుగురు మహిళలు ఉన్నారు. బాధితులంతా ఉత్తర్‌ప్రదేశ్‌లోని అస్రౌలి వాసులు. ఖాటూ శ్యామ్, సలాసర్ బాలాజీ ఆలయాలను సందర్శించుకుని పికప్ వ్యాన్‌లో యూపీలోని స్వస్థలం ఎటావాకు తిరుగుపయనమయ్యారు. బుధవారం తెల్లవారు జామున దౌసా సమీపంలోని మనోహర్‌పూర్ హైవేపై ట్రక్కును వీరు ప్రయాణిస్తున్న వ్యాన్ ఢీకొట్టడంతో దుర్ఘటన జరిగినట్లు స్థానిక ఎస్‌పి రవిప్రకాశ్ శర్మ వెల్లడించారు. ప్రమాద సమయంలో వ్యాన్‌లో మొత్తం 20 మంది ఉన్నారు.

గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని తీవ్ర సంతాపం వెలిబుచ్చారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధితుల గ్రామం అస్రౌలిలో ఎక్కడ చూసిన విషాద చాయలు అలుముకున్నాయి. గ్రామానికి చెందిన 11మంది ఒకే ప్రమాదం మరణించడాన్ని వారంతా జీర్ణించుకోలేకపోతున్నారు. బంధువల ఆర్తనాదాలతో గ్రామం దద్దరిల్లుతోంది. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని యూపీ ప్రభుత్వం ప్రకటించింది. ప్రమాదంపై రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తామని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News