- Advertisement -
మిచిగాన్: అమెరికాలో కత్తిపోట్లు కలకలం రేపాయి. మిచిగాన్ ట్రావర్స్ సిటీలోని వాల్‌మార్ట్ వద్ద శనివారం రాత్రి జనసమూహంపై ఓ దుండగుడు కత్తితో దాడి చేశాడు. ఈ సంఘటనలో 11 మంది కత్తిపోట్లకు గురయ్యారు. స్థానిక అధికారుల ప్రకారం.. బాధితులలో ఆరుగురు పరిస్థితి విషమంగా ఉంది. ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అందుపులోకి తీసుకున్నారు. గాయపడిన వారిని చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. గ్రాండ్ ట్రావర్స్ కౌంటీ షెరీఫ్ మైఖేల్ షియా ఈ దాడిని యాదృచ్ఛిక హింస చర్యగా అభివర్ణించారు. ఈ ఘటనపై ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోందని తెలిపారు.
- Advertisement -